సంయుక్త బాలీవుడ్ ఆశలు ఫలించేనా?

పేరుకు మలయాళీ అయినా తెలుగులో మంచి విజయాలందుకుంది సంయుక్త. తన పేరులోని మీనన్ ని కూడా తొలగించుకుని అచ్చమైన తెలుగమ్మాయే అన్నంతగా టాలీవుడ్ కి కనెక్ట్ అయిపోయింది. పద్ధతైన పాత్రల్లో అందంగా ఒదిగిపోయే సంయుక్తకు.. తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి కిట్టీలో నిఖిల్ ‘స్వయంభూ’తో పాటు మరో ఒకటి, రెండు చిత్రాలున్నాయి.

అయితే.. సంయుక్త ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు చూస్తుందట. అందుకే.. ఈమధ్య వరుసగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో సందడి చేస్తుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఓ కథనం. లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ లో నటించేందుకు లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందట. త్వరలోనే.. ఆ మూవీలో సంయుక్త ఎంట్రీపై క్లారిటీ రానుందట. మొత్తంమీద.. మాతృ భాష మలయాళంలో మొదలుపెట్టి తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న సంయుక్త బాలీవుడ్ ఆశలు ఫలిస్తాయేమో చూడాలి.

Related Posts