నిఖిల్ ప్రమోషన్స్ కు వస్తాడా..?

టాలీవుడ్ టైర్ టూ హీరోస్ లో మంచి జోష్‌ లో ఉన్నాడు నిఖిల్. కార్తికేయ 2తో అనుకోకుండా ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన 18పేజెస్ ఏమంత ఆకట్టుకోలేదు. అయినా ప్రస్తుతం వరుస సినిమాలతో.. అది కూడా అన్నీ ప్యాన్ ఇండియన్ లుక్ ఉన్న చిత్రాలతో మంచి జోష్ లో ఉన్నాడు. అలా రాబోతోన్న చిత్రం ” స్పై”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గ్యారీ బిహెచ్ దర్శకుడు. ఇక ఈ మూవీని ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ప్రస్తుతం ఆ డేట్ కు టైమ్ తక్కువగా ఉందనో లేక మంచి సీజన్ కాదనో.. నిఖిల్ ఆ టైమ్ కు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ విషయంలో నిర్మాత మాత్రం చెప్పిన టైమ్ కే విడుదల చేస్తాను అన్నట్టుగా ఉన్నాడు. అతను బిజినెస్ యాంగిల్ లో తన సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. పైగా ఈ చిత్రానికి కథఅందించింది కూడా అతనే కావడం విశేషం.అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చెప్పినట్టుగా జూన్ 29నే విడుదల చేస్తా అని భీష్మించుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని ఓటిటి కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఆల్రెడీ కొనుగోలు చేసింది. వారితో ఉన్న ఒప్పందాల కారణంగానే నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఈ డేట్ కు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అలా ఫిక్స్ అవ్వడం ఇష్టం లేని నిఖిల్ మాత్రం నిర్మాతతో విభేదించాడు. ఈ విభేదాల గురించి వార్తలు వస్తున్నా ఎవరూ స్పందించలేదు. మొదట రూమర్ అనుకున్నా.. రీసెంట్ గా వచ్చిన పాట విషయంలో నిఖిల్ ఒక్క మాట కూడా చెప్పలేదు. దీంతో గొడవలు నిజమే అని తేలింది.


ఇక ఈ మూవీని ఓవర్శీస్ లో కూడా అమ్మేశారు. అక్కడ కొన్నాళ్లు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలుపెడుతూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. సో.. ఇక నిఖిల్ ఎంత వద్దని చెప్పినా నిర్మాత వినడు అన్న విషయం స్పష్టమైంది. అంటే నిఖిల్ వెనక్కి తగ్గక తప్పలేదు అని చెప్పొచ్చు.

లేదంటే నిర్మాతలే అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఉండాలి. మరి ఇన్ని పంచాయితీల మధ్య నిఖిల్ ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్నగామారింది. ఒకవేళ నిఖిల్ ప్రమోషన్స్ కు రాకపోతే మాత్రం తర్వాతి చిత్రాలకు ఇబ్బంది తప్పదు. పైగా మనోడు తన సినిమాల ప్రమోషన్స్ లో మరింత ఉత్సాహంగా ఉంటాడు.తనకు తానుగా కల్పించుకుని మరీ ముందడుగు వేస్తాడు. మరి ఈ చిన్న మనస్ఫర్థల కారణంగా స్పై మూవీకి దూరంగా ఉంటాడా లేక ఎప్పట్లానే ప్రమోషన్స్ చేస్తాడా అనేది చూడాలి.

Related Posts