‘బిగ్ బాస్‘ నుంచి బయటకు శివాజీ.. కారణం?

‘బిగ్ బాస్-7‘ కంటెస్టెంట్స్ లో బాగా తెలిసిన ముఖం ఎవరిది అంటే శివాజీ అని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ యాక్టర్ గా, హీరోగా ఓ వెలుగు వెలిగిన శివాజీ.. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. అయితే.. ‘బిగ్ బాస్‘లోకి ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు శివాజీ.

‘బిగ్ బాస్-7‘ ఫస్ట్ ఎపిసోడ్ నుంచీ స్ట్రాంగ్ కంటెంస్టెంట్ గా ఉన్నాడు శివాజీ. తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. దీంతో శివాజీ టాప్-5లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అంచనాలున్నాయి. అయితే.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ శివాజీ హౌజ్ లో కొనసాగుతాడా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

టాస్క్ లో భాగంగా శివాజీ చేతికి గాయం అయింది. దాంతో శివాజీని హౌజ్ నుంచి బయటకు పంపించేశారని నిన్నటి ప్రోమోను బట్టి తెలుస్తోంది. శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పడంతో హౌజ్ లో ఉన్నవారు వద్దు వద్దు అంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అసలు శివాజీ హౌజ్ నుంచి బయటకు వెళ్లడానికి.. గాయం ఒక కారణమైతే.. అతను బయటకు వెళ్లి చంద్రబాబుని కలుసుకోబోతున్నాడు అంటూ మరో కారణం కూడా ప్రచారంలో ఉంది. ఏదేఏమైనా.. శివాజీ బయటకు వెళ్లాడా? లేదా? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ పూర్తయ్యేవరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Related Posts