నేటితరం యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ‘డి.జె టిల్లు‘ తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ అయిన సిధ్దూ.. ఇప్పుడు ఆద్యంతం ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ‘తెలుసు కదా‘ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా రాశీ ఖన్నా, ‘కె.జి.యఫ్‘ బ్యూటీ శ్రీనిది శెట్టి కనిపించబోతున్నారు.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లేటెస్ట్ ‘తెలుసు కదా‘ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ని తెలియజేస్తూ క్రియేటివ్ గా తీర్చిదిద్దిన ‘తెలుసు కదా‘ మూవీ అనౌన్స్ వీడియో ఆకట్టుకుంటుంది.