బేబీ హీరోయిన్ నెక్ట్స్ ఏంటీ..

ఒక సినిమా బ్లాక్ బస్టర్ కాగానే అందులోని అందరికీ మంచి ఫేమ్ వస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ కు మెయిన్ రీజన్ హీరోయిన్ అయితే తన క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఆ క్రేజ్ నే ఎంజాయ్ చేస్తోంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలతో మేజర్ షేర్ తనదే. బోల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టింది. అద్బుతమైన నటనను చూపించింది. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

చూడ్డానికి తనది కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలా అనిపించినా.. అలా అనిపించడానికి కారణం తన నటనే. అయితే ఈ తరహా సినిమాలు చేసిన హీరోయిన్లకు మళ్లీ అలాంటి పాత్రలే వస్తుంటాయి. ఇక్కడే తను జాగ్రత్తగా ఉండాలి. మరోసారి అదే రోల్ చేస్తే పాయల్ రాజ్ పుత్ లా అసలుకే మోసం వస్తుంది. పైగా తను తెలుగు హీరోయిన్. ఇంకా సమస్య అవుతుంది. అందుకే తర్వాత ఎంచుకునే కథ ఖచ్చితంగా మెప్పించేలా ఉండాలి. రెగ్యులర్ హీరోయిన్ అయినా సరే.. బేబీ సినిమా ఇమేజ్ ఏ మాత్రం కనిపించకూడదు. అప్పుడే తన కెరీర్ కరెక్ట్ ట్రాక్ లో ఉంటుంది.


అయితే వైష్ణవి చైతన్య తర్వాతి సినిమా ఏంటీ అనే ప్రశ్న మాత్రం అందరిలోనూ వినిపిస్తోంది. ఇప్పటికి చెబుతున్నది ఏంటంటే.. ఎస్కేఎన్ తన బ్యానర్ లోనే మరో రెండు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు అని. అంటే వరుసగా మూడు సినిమాలు ఇదే బ్యానర్లో చేయాలనేదే ఆ అగ్రిమెంట్ అంటున్నారు.

ఇలాంటి అగ్రిమెంట్స్ తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లోనూ కామన్ గా కనిపిస్తాయి. కాకపోతే వాళ్లు మరో సినిమా చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. మరి ఈ అగ్రిమెంట్ మేటర్ నిజమా కాదా అని అటు ఎస్కేఎన్, ఇటు వైష్ణవి ఎవరూ తేల్చలేదు. ఒకవేళ అదే బ్యానర్ లో తర్వాతి సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా కథ విషయంలో తను జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అఫ్‌ కోర్స్ ఏ బ్యానర్ అయినా తీసుకోవాలి.. కానీ సేమ్ బ్యానర్ లో వస్తున్నప్పుడు ఆడియన్స్ గత చిత్రాన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్కువగా చూస్తారు. ఏదేమైనా ఇంత పెద్ద విజయం తర్వాత వైష్ణవి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ అనే క్యూరియాసిటీ మాత్రం చాలామందిలో ఉంది. అదేదో త్వరగా తేల్చేస్తే.. బెటరేమో.

Related Posts