రజినీకాంత్ జైలర్ పై దర్శకుడి నిరసన

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా జైలర్ ను అడ్డుకోవాలని చెబుతూ జైలర్ సినిమా దర్శకుడు నిరసనకు దిగిన వైనం ఇది. అదేంటీ ఆ సినిమా దర్శకుడే అలా ఎందుకు చేస్తాడు అనుకుంటున్నారా..జస్ట్ వెయిట్. ఇది జైలర్ సినిమా దర్శకుడి గురించే. కానీ తమిళ్ నుంచి కాదు. మళయాలం నుంచి. మళయాలంలో కూడా జైలర్ పేరుతో సక్కీర్ మదాత్తిల్ అనే దర్శకుడు ఓ సినిమా చేశాడు.

తన సినిమా టైటిల్ తో వస్తోన్న రజినీకాంత్ సినిమా జైలర్ టైటిల్ మార్చాలనీ.. కనీసం మళయాలంలో అయినా వేరే పేరు పెట్టాలని లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటా అని కొన్నాళ్లుగా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. కానీ అతని గోడును మళయాల పరిశ్రమ పట్టించుకోలేదు. దీంతో తను కూడా తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడా తనకు అన్యాయం జరుగుతుందీ అంటూ “కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(KFCC) ముందు ఒక్క రోజు నిరసన చేపట్టాడు.

ఈ సందర్భంగా..
“తన సినిమాకు థియేటర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ఇతర భాషల భారీ బడ్జెట్ చిత్రాల నుండి మలయాళ చిత్రాలను కాపాడాలని కూడా ఆయన కోరారు. కేరళలోని ఎగ్జిబిటర్లు నా సినిమాను ప్రదర్శించడానికి సిద్ధంగా లేరు. పైగా రజనీకాంత్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. థియేటర్ల పరిస్థితే ఇలా ఉంటే ఓటీటీ విడుదలకు 42 రోజుల సమయం కావాలని థియేటర్ల యాజమాన్యాలు పట్టుబడుతున్న తరుణంలో మలయాళ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుంది?. తమిళ సినిమాలు కేరళలో విడుదల కావడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. అయితే మలయాళ ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా ఇది జరగకూడదు. మంచి వసూళ్లు రావాలంటే నాకు కనీసం 70-75 థియేటర్లు అవసరం అయితే, నా సినిమా 40 కూడా రాదనిపిస్తోంది, ఇంతకుముందు దీన్ని ప్రదర్శించడానికి అంగీకరించిన చాలా మంది ఎగ్జిబిటర్లు ఇప్పుడు అలా చేయడానికి ఇష్టపడరు.. ” మదాత్తిల్ తన నిరసనను ప్లకార్డ్‌స్ ద్వారా ప్రదర్శిస్తూ ఆవేదన వెలిబుచ్చుతున్నారడు.

Related Posts