‘కన్నప్ప’లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి?

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎక్కువభాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికొస్తే పెద్ద లిస్టే ఉంది. వారిలో ప్రభాస్ కూడా ఒకడు.

అసలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడైన ప్రభాసే.. ‘కన్నప్ప’ రీమేక్ లో నటించాల్సి ఉంది. ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో అది కుదరలేదు. మంచు విష్ణు మాత్రం ‘కన్నప్ప’ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ‘భక్త కన్నప్ప’ సినిమాని ప్రేమించిన వారికోసం ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ ను కూడా తీసుకొచ్చాడు. అయితే.. ‘కన్నప్ప’లో ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తాడు? అనేదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది.

తొలుత ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. నయనతార పార్వతిగా కనువిందు చేయనుందని వినిపించింది. అయితే.. లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ నందీశ్వరుడిగా అలరించనున్నాడట. కనిపించేది కాసేపే అయినా.. ఆ పాత్ర ఎంతో మెమరబుల్ గా ఉండబోతున్నట్టు ‘కన్నప్ప’ టీమ్ నుంచి వినిపిస్తున్న సమాచారం.

Related Posts