లీడ్ యాక్టర్స్ లేకుండానే ‘వార్ 2‘

‘ఆర్.ఆర్.ఆర్‘తో టాలీవుడ్ లో అసలెవరూ ఊహించని మల్టీస్టారర్ కి నాంది పలికిన
ఎన్టీఆర్.. ఇప్పుడు ‘వార్ 2‘తో మరో సంచలనానికి తెరలేపాడు. కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘వార్‘కి ఈ చిత్రం సీక్వెల్. ‘బ్రహ్మాస్త్ర‘ ఫేమ్ అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

‘వార్‘ ఫ్రాంచైస్ అనగానే హై ఆక్టేన్ స్టంట్స్ గుర్తుకొస్తాయి. ‘వార్ 2‘లోనూ అలాంటి యాక్షన్ ఘట్టాలకు కొదవే లేదట. లేటెస్ట్ గా ‘వార్ 2‘కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేశాడట డైరెక్టర్ అయన్ ముఖర్జీ. అయితే ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్స్ ఇద్దరూ లేకపోవడం విశేషమని చెప్పాలి.

ఇటు ఎన్టీఆర్, అటు హృతిక్ ఇద్దరూ లేకుండానే వీరిద్దరి బాడీ డబుల్స్ తో మొదటి షెడ్యూల్ ని పూర్తిచేశాడట అయన్ ముఖర్జీ. స్పెయిన్ లో 12 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలకమైన ఓ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించారట. ఇక.. డిసెంబర్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2‘ సెట్స్ లో పాల్గొంటారట. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర‘ సినిమాతో బిజీగా ఉంటే.. హృతిక్ రోషన్ ‘ఫైటర్‘ మూవీతో బిజీగా ఉన్నాడు.

Related Posts