ఆశలు తీరాలంటే అవి చేయాల్సిందే పూరీ

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఆయనతో పనిచేయాలని ప్రతి హీరో కలలు కన్నాడు. అతను తన హీరోలను ప్రెజెంట్ చేసే స్టైల్ మాస్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఓ రకంగా హీరో క్యారెక్టరైజేషన్ ను పూర్తిగా మార్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. నెగెటివ్ ఇమేజ్ తో తన హీరోలను ప్రెజెంట్ చేశాడు.. చేస్తున్నాడు కూడా. అయితే ఇది మాత్రమే చేస్తూ వెళ్లడంతో ఓ దశలో మొనాటనీ వచ్చేసింది.పైగా కథలోని టెంప్లేట్ కూడా మారడం లేదు.

అందుకే ఈ దశాబ్దంలో కేవలం రెండు హిట్స్ మాత్రమే ఉన్నాయి. టెంపర్.. ఇస్మార్ట్ శంకర్. లైగర్ తో ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టి జాతీయ స్థాయిలో అభాసుపాలయ్యాడు. అయినా అతనికి ప్యాన్ ఇండియన్ ఇమేజ్ పై ఆశ తగ్గలేదు. అందుకే మరోసారి డబుల్ ఇస్మార్ట్ తో ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నా అంటున్నాడు. అందుకోసమే విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నాడు. అతనికి ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్. సంజూ భాయ్ ఉంటే బాలీవుడ్ లో ప్లస్ అవుతుంది. అందులో డౌట్ లేదు. అయితే సినిమాలో కంటెంట్ కూడా ఉండాలి. ఆ కంటెంట్ ను ఎలివేట్ చేసే టెక్నీకల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇక్కడే నిర్మాతలు కూడా అయిన పూరీ జగన్నాథ్, ఛార్మీలు తమ పిసినారితనం చూపిస్తున్నారట.


ఇస్మార్ట్ శంకర్ విజయంలో సంగీతానికి ఓ కీలక పాత్ర. పాటల నుంచి నేపథ్యం సంగీతం అద్భుతం చేశాడు మణిశర్మ.అంతకు ముందు ఫ్లాపుల్లో మణిశర్మకూ ఇది కమ్ బ్యాక్ మూవీ అయింది.అందుకే మరోసారి అతన్నే తీసుకోవాలనుకున్నాడు పూరీ. మణిశర్మ రెండు కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడట.అది చాలా పెద్ద మొత్తం అని ఫీలయ్యారట పూరీ, ఛార్మీ. దీంతో తమన్ ను తీసుకుందాం అంటే అతను ఏకంగా ఐదారుకోట్లు అంటాడు. దీంతో లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియోను తీసుకుందాం అనుకున్నారట.

ఇప్పుడు అతనూ రెండు కోట్లు అంటున్నాడు. దీంతో మళ్లీ మణిశర్మనే తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అతను ఏమంటాడో అనే ఆలోచన ఒకటి.బాలీవుడ్ నటుడుకి అంత ఇచ్చినప్పుడు ఇంత సీనియర్ టెక్నీషియన్.. అయిన మణిశర్మకు రెండు కోట్లు అనేది పెద్ద విషయం కాదేమో. పైగా ఆడియో రైట్స్ విషయంలో మణిశర్మ లాంటి వాడి పేరుకు ఎక్కువ వెయిట్ ఉంటుంది. అయినా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సత్తా చాటాలనుకుంటున్నప్పుడు ఇలాంటివి పట్టించుకుంటే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. జాతీయ స్థాయిలో హిట్ కొట్టాలనే ఆశలు ఉన్నప్పుడు ఇలాంటివి చేయాల్సిందే.

Related Posts