సినీ ప్రముఖుల చేతుల మీదుగాఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’

కేతిక హన్మయశ్రీ సమర్పణలో యు.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ శంకర్‌, మహేష్‌ యడ్లపల్లి, ఆయూషి పటేల్‌, అనుశ్రీ లీడ్‌ రోల్స్‌లో పవన్‌ శంకర్‌ దర్శకత్వంలో పల్లపు ఉదయ్‌ కుమార్‌ నిర్మిస్తు చిత్రం ‘విశాలాక్షి’. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను వీరశంకర్‌, రాజ్‌కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్‌ సంయుక్తంగా లాంచ్‌ చేశారు.

అనంతరం దర్శకుడు పవన్‌ శంకర్‌ మాట్లాడుతూ…
విచ్చేసి గెస్ట్‌లు అందరికీ కృతజ్ఞతలు. ఇది ఇన్వెస్టిగేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అలాగే మంచి సస్పెన్స్‌తో నడుస్తుంది. మంచి కథ. మంచి టెక్నికల్‌ టీం అండ్‌ ఆర్టిస్ట్‌లు కుదిరారు. ఇందులో 5 పాటలు, 5 ఫైట్‌లు ఉంటాయి. మొత్తం 4 షెడ్యూల్స్‌లో సినిమా

Related Posts