రామ్ చరణ్ తో విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి.. జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి చిన్న చిన్న పాత్రలతో మెప్పించి హీరోగా మారి.. విలన్ గా చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చేస్తూ.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారాడు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగాతెలుగులో ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా ఆయన చేసిన పాత్ర సినిమాకే బ్యాక్ బోన్ లా నిలిచింది.

ఇప్పుడు అదే దర్శకుడు చేస్తోన్న సినిమాలో మరోసారి ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఉప్పెనతో దర్శకుడుగా తన ముద్రను వేసిన బుచ్చిబాబు.. రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ కథను కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే తీయాలనేది అతని కల. కానీ ఆ కల మారింది. ఎన్టీఆర్ స్థానంలో రామ్ చరణ్ వచ్చాడు. ఓ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.


రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఈ నెలాఖర్లో షెడ్యూల్ కు వెళుతుందంటున్నారు. కానీ గ్యారెంటీ లేదు. మరోవైపు బుచ్చిబాబు చాలా వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన ఫస్ట్ మూవీకి బెస్ట్ అప్పీరియన్స్ గా నిలిచిన విజయ్ సేతుపతిని రామ్ చరణ్ సినిమాలో తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు.

అయితే విజయ్ సేతుపతి అనగానే విలన్ గానే అనుకున్నారు చాలామంది. బట్ విజయ్ ఈ సినిమాలో విలన్ గా కాక.. చరణ్‌ తర్వాత ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకుటున్నారట. ప్రస్తుతం విజయ్ కి ఈ కథ వినిపించే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. అతనికి నచ్చితే.. రామ్ చరణ్ సినిమాలో అతను నటించడం ఖాయం అంటున్నారు.


విజయ్ సేతుపతి ఆల్రెడీ రామ్ చరణ్ నిర్మించిన మెగాస్టార్ మూవీ సైరాలో ఓ కీలక పాత్ర చేసి ఉన్నాడు.సో.. చరణ్‌ మూవీ అంటే కథ ఏ మాత్రం నచ్చినా.. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ నటిస్తాడు అనుకోవచ్చు. ఇక విజయ్ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే ప్యాన్ ఇండియన్ స్థాయిలో పెద్ద ఎసెట్ అవుతాడు అనే చెప్పాలి.

Related Posts