మరోసారి చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోని

ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ప్రధానం. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే ఆడియన్స్ ను అంతలా ఆకర్షించొచ్చు. అందుకే టైటిల్స్ పెట్టడం విషయంలో మన మేకర్స్ ఇప్పుడు నయా ట్రెండ్ అవలంబిస్తున్నారు. పాత చిత్రాల టైటిల్స్ నే తమ చిత్రాలకు పెట్టుకుంటూ క్లాసీ టైటిల్స్ క్రేజును ఉపయోగించుకుంటున్నారు.

తెలుగు దర్శకులు పాత తెలుగు సినిమా టైటిల్స్ పెట్టుకోవడం అరుదుగా జరిగే విషయమే. అయితే ఇప్పుడు కొంతమంది తమిళ కథానాయకులు తమ తెలుగు అనువాదాల కోసం ఏరికోరి మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ ను ఎంచుకుంటున్నారు. చిరంజీవి పాత సినిమాల టైటిల్స్ తో కార్తీ నటించిన ‘ఖైదీ, దొంగ’ సినిమాలొచ్చాయి. ఇక విజయ్ ‘మాస్టర్’, సూర్య ‘రాక్షసుడు’ సినిమాలకు కూడా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్ ను వాడేశారు.

మెగాస్టార్ ఓల్డ్ టైటిల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టే మరో తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోని. గతంలో చిరంజీవి టైటిల్స్ తో ‘రోషగాడు, జ్వాల’ సినిమాలు చేశాడు విజయ్ ఆంటోని. అయితే విజయ్ ఆంటోని నటించిన ‘జ్వాల’ డిలే అయ్యింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ మరో టైటిల్ ‘హిట్లర్’ని తన అప్ కమింగ్ మూవీకి పెట్టుకున్నాడు. చిరంజీవి వరుసగా పరాజయాల్లో ఉన్న సమయంలో ‘హిట్లర్’ సినిమా ఆయనకి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. మరి.. ఇప్పుడు విజయ్ ఆంటోని కి కూడా ‘హిట్లర్’ టైటిల్ పవర్ బాగా కలిసొస్తుందేమో చూడాలి.

Related Posts