HomeMoviesటాలీవుడ్‘వెయ్ దరువెయ్’ ఔట్ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ : నిర్మాత దేవరాజ్ పోతూరు

‘వెయ్ దరువెయ్’ ఔట్ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ : నిర్మాత దేవరాజ్ పోతూరు

-

పూరీ జగన్నాధ్‌ తమ్ముడు చాలా కాలం తర్వాత హీరోగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నాడు. సాయిరామ్ శంకర్ తో పాటు యషా శివకుమార్, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ ‘వెయ్ దరువెయ్‘. నవీన్ రెడ్డి డైరెక్షణ్‌లో దేవరాజ్‌ పోతూరు నిర్మించారు. మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్భంగా.. చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు నిర్మాత దేవరాజ్‌ పోతూరు.


ఈ వెయ్ దరువెయ్ సినిమా తమ ప్రొడక్షన్‌లో రెండో సినిమా అనీ, నవీన్ రెడ్డి కథ చెప్పగానే నచ్చిందన్నారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయడం, ఆన్‌ టైమ్ అందరూ సెట్స్‌లో ఉండాలి అనే కండిషన్స్‌తో ఈ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టామన్నారు దేవరాజ్‌ పోతూరు. అనుకున్నట్టుగా 35 రోజుల్లో కంప్లీట్ చేయగలిగామన్నారాయన. దీనివల్ల పదిశాతం బడ్జెట్‌ అదుపు చేయగలిగామన్నారు.
ఈ సినిమాలో 80 శాతం కామెడీ ఉంటుంది. అలాగే అద్భుతమైన తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ఉంటుందన్నారు. సాయిరామ్‌ శంకర్ చాలా బాగా యాప్ట్ అయ్యారు. ఈసినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసారన్నారు.
వెయి దరువెయ్ అనేది కామెడీ ఎంటర్‌టైనరే కాదు.. ఇందులో సమాజంలో జరిగే ఎన్నో అంశాలను టచ్ చేసామన్నారు. యదార్ధ సంఘటనల స్పూర్తితో కమర్షియల్ సినిమాగా తీర్చి దిద్దామన్నారు. కామారెడ్డి టు హైదరాబాద్‌ వచ్చిన హీరో చుట్టూ జరిగే అంశాలు ఇంట్రస్టింగ్ గా వుంటాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంఘటనలు టచ్ చేసామన్నారు.


సినిమా పూర్తయ్యాక ఔట్‌ రేట్ కు అడిగిన వారు మార్పులు చేర్పులు చెప్పడంతో.. అవి షూట్ చేయడానకి ఆర్టిస్టుల డేట్స్‌ అడ్జస్ట్ కావడం కష్టమయ్యింది. దాంతో షూటింగ్ ఆలస్యమై రిలీజ్‌ లేటయ్యిందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు హ్యాపీగా బయటకొస్తాడన్నారు. సాయిరామ్‌తో తనకు మంచి అనుబంధం ఉందనీ.. ఈ సినిమాతో హీరోగా ఆయన బిజీ అవుతారన్నారు.
భీమ్స్ సంగీతం, టెక్నికల్ సపోర్ట్ చక్కగా కుదిరందన్నారు. ఆర్టిస్టులు సీనియర్స్ కావడంతో షూటింగ్ త్వరగా పూర్తయ్యేదన్నారు.
తన సినిమాలు లిమిటెడ్ బడ్జెట్‌లో పూర్తవ్వాలనుకుంటానన్నారు. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా బడ్జెట్‌ ప్లాన్ చేసుకుంటానన్నారు నిర్మాత దేవరాజ్ పోతూరు.

ఇవీ చదవండి

English News