వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. అర్జునుడి గీతోపదేశం ప్రారంభం

టాలీవుడ్ జయమ్మ గా పాపులర్ అయిన విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రీసెంట్ హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రియల్‌ లైఫ్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న వరలక్ష్మీ..

తెలుగులో మరో సినిమాకు సైన్ చేసింది. అర్జునుడి గీతోపదేశం అనే టైటిల్‌తో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనుందీ చిత్రం. ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.
అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో… 90 మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ వసంతిక , రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్ర నటీనటులు, టెక్నిషియన్స్‌ సినిమా ప్రారంభం పట్ల , విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts