ఉల్లిపొర చీరలో బుల్లితెర స్టార్

బుల్లితెరను అందరికంటే ఎక్కువ హీటెక్కించిన బ్యూటీ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు చెప్పే ఏకైక పేరు అనసూయ. జబర్దస్త్ కు ఆ రేంజ్ హైప్ వచ్చిందంటే కారణం అనసూయ అందాల ప్రదర్శన కూడా అనేది కాదనలేని సత్యం. ఆ షో ద్వారానే తను పాపులర్ అయింది. ఆ షో తర్వాతే తనకంటూ ఓ రేంజ్ వచ్చింది. తన స్కిన్ షోకు భయపడి అప్పటి వరకూ టాప్ యాంకర్ గా ఉన్న ఉదయభాను, ఝాన్సీ వంటి వారి అడ్రెస్ గల్లంతయ్యింది. సుమను మాత్రం ఢీ కొట్టలేకపోయింది.

ఇక బుల్లితెరపై పాపులారిటీ వెండితెర ఎంట్రీని ఈజీ చేస్తుంది కదా.. అలా అనసూయ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచీ ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తూ నటిగా తనలో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

బట్ పాత్రల వరకూ ఎలా ఉన్నా.. బయట మాత్రం ఆ హాట్ నెస్ తగ్గించలేదు. ఇంకా చెబితే రోజు రోజుకూ డోస్ పెంచుతోందే తప్ప తగ్గించడం లేదు. తగ్గించమని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఆ మాటకొస్తే కామెంట్ రైట్ కూడా లేదు. అయినా ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. వాటికి తనూ తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం శృతి మించాయని సైబర్ పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసింది.


ఇక ప్రస్తుతం పెదకాపు1 సినిమాలో మరోసారి అద్భుతమైన పాత్ర చేశానని చెబుతోంది అనసూయ. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లోనూ పాత్రకు భిన్నంగా హాట్ హాట్ గా కనిపిస్తూ కవ్విస్తోంది. తాజాగా నల్లని ఉల్లిపొర చీరలో సోయగాలారబోస్తూ ఆకట్టుకుంటోంది.

ఏదేమైనా ఇద్దరు పిల్లల తల్లిగా ఏదైనా చేయడం, చేయగలగడం అనసూయకే చెల్లింది. ఈ విషయంలో భానుమతిలా అనసూయ కూడా సింగిల్ పీస్. అన్నట్టు ఆ మధ్య టూ పీస్ బికినీలో మంటలు రేపింది కదా.. అంచేత తను సింగిల్ పీస్ అంటే నష్టమేం లేదేమో.

Related Posts