చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించి అక్కడి సిఐడి పోలీస్ లు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అయ్యి రెండు వారాలు దాటింది. ఇన్ని రోజులైనా ఇంకా బెయిల్ రాలేదు. అయితే ఇది అక్రమ అరెస్ట్ అయిన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు.

ఇటు తెలంగాణలో కూడా చంద్రబాబు సానుభూతిపరులు, టిడిపి అభిమానులు ధర్నాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. ఆశ్చర్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ర్యాలీలు, ధర్నాలు చేయని ఐటి ఎంప్లాయ్స్ చంద్రబాబు కోసం రోడ్లెక్కారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐటీ కారిడార్ కు కారిడార్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఎంప్లాయ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాలు, ర్యాలీలు చేయొద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేసింది. అసలే ఐటికి హైదరాబాద్ స్వర్గధామంగా ఉంది. ఏ పర్మిషన్ ఇట్టే వచ్చేస్తోంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వంతో పెట్టుకోవాలని ఏ కంపెనీ అనుకుంటుంది. అందుకే ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన మరుక్షణం అన్నీ ఆగిపోయాయి. ఇక్కడి ఎంప్లాయ్స్ రాజమండ్రి వెళ్లి ధర్నా చేయాలనుకున్నారు. వారిని ఏపి బార్డర్స్ లోనే పోలీస్ లు అడ్డుకున్నారు.


అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని మరికొందరు ఐటీ ఎంప్లాయ్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్లు, కొందరు బిఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో కేటీఆర్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆయన తనదైన శైలిలో ఇలా బదులిచ్చాడు.


” చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తెలంగాణ కు ఏమి సంబంధం. తెలంగాణ లో ఎందుకు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. ఇవాళ వీళ్లు చేస్తే రేపు మరొకరు చేస్తారు. మరి అధికారంలో ఉన్న మేమేం చేయాలి. ఇది మా ప్రభుత్వం కదా. మాకు ఏ సంబంధం లేని ఇష్యూ గురించి మేమెందుకు మాట్లాడాలి. ఇక్కడ ధర్నాలు చేసేవారిని ఏపీలో ఏమన్న చేసుకోండి.. ఇది రెండు రాజకీయ పార్టీల తగాదా మాకేం సంబంధం. ఇక్కడ ఎలాంటి ఆందోళనలు చేయద్దు. బాబు అంశం కోర్టులో ఉంది. తను దోషినా, నిర్దోషినా అనేది చంద్రబాబు కోర్ట్ లో నిరూపించుకుంటాడు.

ఆంధ్రలో నాకు జగన్, లోకేష్, పవన్ అందరు ఫ్రెండ్స్.. అలాగని తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడితే ఎలా ఊరుకుంటాం. నాకు లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వమని అడిగారు. కానీ మాకు హైదరాబాద్ లో శాంతి భద్రతలు ముఖ్యం అని చెప్పాము. ఐటి సెక్టర్ లో ఎలాంటి సమస్యలూ రాకూడదనేది మా పాలసీ. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళతాం.

మా పార్టీ నుంచి కొందరు వ్యక్తిగతంగా స్పందించారు. అది మా పార్టీ స్టాండ్ కాదు. మేం తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నాం.. పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఇదే మా తుది నిర్ణయం..” అని కుండ బద్ధలు కొట్టాడు కేటీఆర్. మరి ఇకపైన కూడా ఐటీ పీపుల్ ఇలాంటి అగ్రెసివ్ విషయాలకు దూరంగా ఉంటారా లేక తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తారా అనేది చూడాలి.

Related Posts