బిచ్చగాడు మూవీతో తెలుగునాట కూడా పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ విజయ్ ఆంటోని.. కొత్త సినిమా తాను ఇంత వరకు టచ్ చేయని జోనర్‌లో అందించబోతున్నాడు. వినాయక్ వైద్యనాథన్ డైరెక్షన్‌లో విజయ్ ఆంటోనీ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్‌గురు‘ . మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కుతుంది. ఈ జోనర్‌లో విజయ్ ఆంటోనీ తొలిసారి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ “లవ్ గురు” సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ “లవ్ గురు” సినిమా చూస్తే గర్ల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు అన్నారు విజయ్ ఆంటోని. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. లవ్ గురు చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని లేడీస్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారన్నారు.
మిగతా టెక్నిషియన్స్, నటీనటులు సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.