టైగర్ నాగేశ్వరరావు మాస్ ర్యాంపేజ్

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు‘. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ను ముంబై వేదికగా విడుదల చేశారు మేకర్స్. రవితేజ మాస్ ర్యాంపేజ్ తో ‘టైగర్ నాగేశ్వరరావు‘ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట పాతిక వేలు అంటూ దొంగలంతా వేలం పాట పాడుకునే సీన్స్ తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం వింటేజ్ మాస్ ట్రీట్ లా ఉంది. ఈలోపులో ‘పోలీసులకు విజ్ఞప్తి కాకినాడ నుంచి మద్రాస్ వెళ్లు సర్కార్ ఎక్స్ ప్రెస్ దారిలో దోపిడీకి గురికాబోతుంది‘ అంటూ మాస్ ఎంట్రీ ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ‘హీ హ్యాస్ హంగర్ ఫర్ పవర్.. హీ హీస్ గ్రీడీ ఫర్ ఉమన్.. హీ హ్యాస్ లస్ట్ ఫర్ మనీ..‘ అంటూ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ను చెప్పకనే చెప్పారు.

ఇంకా ‘కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు‘ అంటూ రవితేజ మార్క్ డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇతర నటీనటుల విషయానికొస్తే.. రవితేజాకి జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. ‘దొంగతనానికి కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు.. తెలివి తేటలు కూడా కావాలి‘ అనే డైలాగ్ తో నాజర్ దొంగలకు శిక్షణ ఇచ్చే పాత్రలో కనిపించాడు. ఐ.బి. ఆఫీసర్ గా అనుపమ్ ఖేర్, పోలీసుల పాత్రల్లో మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా కనిపించారు. ట్రైలర్ లో రేణు దేశాయ్ కూడా కొంత సేపు కనిపించింది.

1970, 80ల కాలం నాటి స్టూవర్ట్ పురం అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించడంలో డైరెక్టర్ వంశీ తీసుకున్న కేర్ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ మది, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొళ్ల ప్రతిభకు ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమా మరో ఉదాహరణ కాబోతుందనుకోవచ్చు. ‘కశ్మీర్ ఫైల్స్‘తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ‘టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తుంది. మొత్తంమీద ట్రైలర్ తో మంచి మార్కులు వేయించుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రం దసరా బరిలో ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Related Posts