తరుణ్ పెళ్లి వార్తలో అసలు నిజం ఇది ..

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఇప్పుడున్న స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు తరుణ్. అంతకు ముందే బాలనటుడుగానూ అతను స్టార్. ఓ రకంగా బాలనటుడుగా స్టార్డమ్ తెచ్చుకున్నవాళ్లెవరూ హీరోగా ఒక రేంజ్ ను చూడలేదు. బట్ తరుణ్ అందుకు మినహాయింపు. తను హీరోగా బ్లాక్ బస్టర్స్ చూశాడు. పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్నాడు.

కానీ ఎందుకో దాన్ని కంటిన్యూ చేయలేదు. సినిమాలు లేక కాదు.. తనకు తానుగానే సినిమాలకు దూరం అయ్యాడు తరుణ్. కారణాలేంటనేది ఎవరికీ తెలియదు. బట్ ఇప్పటికీ అతన త్వరలోనే వస్తున్నా అనే కార్డ్ పట్టుకుని కనిపిస్తాడు తప్ప ఎప్పుడు వస్తాడు.. ఎవరి డైరెక్షన్ లో వస్తాడు అనేది చెప్పడు. ఇది దాదాపు పదేళ్లుగా సాగుతున్న వ్యవహారం. 2014లో యుద్ధం, వేట అనే సినిమాల తర్వాత అతను యాక్టివ్ గా లేడు. మధ్యలో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. కానీ విడుదల కాలేదు. అవుతుందని కూడా చెప్పలేం.


అలాంటి తరుణ్ పై కొన్ని రోజులుగా ఓ ఆశ్చర్యకరమైన రూమర్ వస్తోంది. అతను మెగా ఇంటికి అల్లుడుగా వెళ్లబోతున్నాడు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఇంటికి అంటే ఇప్పుడు నాగబాబు కూతురు, చిరంజీవి రెండో కూతురు మాత్రమే పెళ్లికి ఉన్నారు. డివోర్స్ తీసుకుని ఉన్న వీరిలో ఒకరితో తరుణ్‌ పెళ్లి జరగబోతోందనే ఈ వార్తలను జనం పెద్దగా నమ్మలేదు.

కానీ పెద్దింటి వ్యవహారాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు కదా.. అందుకే ఏదో మూల నిజమేనా అనుకున్నారు కూడా. కానీ కాదు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తరుణ్ స్వయంగా స్పందించాడు. అవన్నీ ఆధారం లేని వార్తలు అన్నాడు. తన పెళ్లిపై ఎందుకు ఇన్ని రూమర్స్ వస్తున్నాయో తెలియదు కానీ.. తనకు నిజంగా పెళ్లి సెట్ అయితే ఆ విషయం ముందుగా మీడియాకు చెప్పిన తర్వాతే పనులు మొదలుపెట్టుకుంటా అన్నాడు. సో.. ఇది బేస్ లెస్ న్యూస్ అన్నమాట.


నిజానికి గతంలో కూడా తరుణ్ పై ఇలాంటి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ ను పెళ్లి చేసుకున్నాడు అన్నంతగా వచ్చాయా వార్తలు. ఆ తర్వాతే అతని కెరీర్ ఆగింది. అలాగే ప్రియమణితో కూడా వ్యవహారం ఉందనే రూమర్స్ వచ్చాయి. సో.. తరుణ్ పై ఇలాంటి రూమర్స్ కొత్త కాదు. కానీ మెగా ఫ్యామిలీ అనడమే ఇప్పుడు వింత అయింది.

Related Posts