ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద గిఫ్ట్ – అనిల్ సుంకర

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ సుంకర మాట్లాడుతూ.. ” దర్శకుడు మెహర్ రమేష్ గారూ చాలా థ్యాంక్స్ అండీ. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఒక కల కనాలా వద్దా అనే కలని నిజం చేశారు.చిరంజీవి గారితో సినిమా అనే కలను నెరవేర్చింది రమేష్ గారు.

చిరంజీవి గారితో జర్నీ చేసినప్పుడు నేర్చుకున్నంత నా మొత్తం లైఫ్ లో ఏదీ నేర్చుకోలేదు. ఆయన నటుడుగా అందరికీ తెలుసు. కానీ గొప్ప మానవతా వాదిగా నేను ఆయన గురించి తెలుసుకున్నాను. ఈ సినిమాక కో ప్రొడ్యూసర్ గా ఉన్నాను.

మీతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. రమేష్ గారు ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన అన్నీ ఉంటాయి. కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేయడానికి తనకంటే మించిన నటి లేదు. తన డేట్స్ కోసం చాలా కష్టపడ్డాం. తను మా కష్టాన్ని మర్చిపోయేలా నటించింది. అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. అభిమానులకు ఆగస్ట్ 11న గిఫ్ట్ ఇవ్వబోతున్నాం.. ” అన్నాడు

Related Posts