మేము చిరంజీవి ఫ్యాన్స్ కాదు లవర్స్ – మెహర్ రమేష్

భోళా శంకర్ సినిమాకు సంబంధించి అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచింది దర్శకుడు మెహర్ రమేష్. దర్శకుడుగా ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినా.. ఒక్క హిట్టూ కొట్టలేకపోయాడు. చాలా రోజుల క్రితమే ఆయన్న ఇండస్ట్రీ వదిలేసింది. అలాంటిది సడెన్ గా మెగాస్టార్ మూవీతో రీ ఎంట్రీ అంటే ఆశ్చర్యం కాక ఏముంటుంది. ఎన్నాళ్లుగానో మెగా ఫ్యామిలీతో కలిసి ఉన్న మెహర్ రమేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ” మెగాస్టార్ ఫ్యాన్స్.. మీ లో నుంచి వచ్చినవాడినే నేను.

అన్నయ్యతో సినిమా చేయడం ఈ జన్మనలో నేను చేసుకున్న అదృష్టం.ఒక షాడోలో ఉన్న నాపై మెగాస్టార్ అనే వెలుగు పడింది. ఇది అన్నయ్య నాకు ఇచ్చిన పునర్జన్మ. ఈ పునర్జన్మను వినయోగించుకున్నాను అనుకుంటన్నాను. ఇందులో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారి సహకారం మరవలేనిది. నేను అన్నయ్యను ఎంత ప్రేమిస్తున్నానో అనిల్ గారు అంతే ప్రేమిస్తున్నారు. చిరంజీవి అభిమాని అంటేనే ఒక గుర్తింపు ఉన్న రోజుల్నించి వచ్చినవాడిని నేను. మా నాన్న కూడా పోలీస్. కానీ అంతకు మించి చిరంజీవి గారి బంధుత్వం అనే గుర్తింపు నాకు ఎప్పటికీ గుర్తింపు.మాకు అన్నయ్య పేరు తలవని రోజు లేదు. ఇవాళ డైరెక్టర్ గా ఈ భోళా శంకర్ సినిమా చేయడం అనే అవకాశం గొప్ప విజయం. ఈ సినిమాను మీకు ఎలా నచ్చుతుందో అలా చేశాం. ఈ టైమ్ లో ఒక గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.

మా సినిమాటోగ్రాఫర్ తో పాటు సినిమా చేసినవాళ్లందరం మేము ఫ్యాన్స్ కాదు.. లవర్స్. ఈ మూవీ టెక్నీషియన్స్ అందరం ఆయన అభిమానులమే. అందరి సపోర్ట్ తో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నాం. అన్నయ్యపై నాకున్న అభిమానం చూపడానికి ఈ జన్మ సరిపోదు. మా పేరెంట్స్ నుంచి నా వరకూ ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోం. ఆయన గురించి వెబ్ సైట్స్ లో రాసినా నేను ఫైట్ చేశాను. కానీ ఆయన మాత్రం అందరికీ ప్రేమను పంచడమే తెలుసు. ఒక ఎన్ సైక్లోపీడియా లాంటి ఆయనతో సినిమా చేయడం అదృష్టం. అల్లు అరవింద్ గారికి, నిర్మాత రామబ్రహ్మం సుంకర గారికి థ్యాంక్యూ. ఈ సినిమా మీ అందరికీ వాల్తేర్ వీరయ్య రికార్డ్స్ ను తిరగరాస్తుందని అనుకుంటున్నాను. ఒక మెగాస్టార్ తో ఒక మెగానటి ఉండాలని కీర్తినిఅనుకున్నాం. తను నాకూ చెల్లెలు అయిపోయింది. నాకంటే ఎక్కువగా అన్నయ్య ఆ అమ్మాయిని మిస్ అవుతుంటారు. అంత బాగా కలిసిపోయింది. గ్యాంగ్ లీడర్ సినిమా టైమ్ లోనే అన్నయ్య నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను. ఆయనకి తెలియని విషయం లేదు. మనం ఎలా అనుకుంటున్నాం అనే అవకాశం మనకు ఇస్తారు. ప్రేక్షక దేవుళ్లకు ఏం కావాలో మన దేవుడికి బాగా తెలుసు.. ” అన్నాడు.

Related Posts