తెలుగులో సెన్సేషనల్ సర్వైవల్ థ్రిల్లర్‌ ‘మంజుమ్మెల్ బాయ్స్’

ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించిన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు.

పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
తెలుగులోనూ అదే టైటిల్‌తో ‘మంజుమ్మెల్ బాయ్స్’ విడుదలౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు బ్యాకింగ్ ఇవ్వడంతో తెలుగులో చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది

Related Posts