లండన్ లో మకాం పెట్టిన రెబెల్ స్టార్.. అసలు కారణం ఏంటి?

మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కాదు. పాన్ వరల్డ్ స్టార్స్ గా మారుతున్నారు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉండే నటుడు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలుగు నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్.. నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుణ్యమా అని పాన్ వరల్డ్ రేంజులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విదేశాల్లో సైతం డార్లింగ్ కి ఓ రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

‘బాహుబలి‘ ముందు వరకూ హైదరాబాద్ కే పరిమితమైన ప్రభాస్.. ఆ తర్వాత ముంబైని తన సెకండ్ హోమ్ గా మార్చుకున్నాడు. హైదరాబాద్, ముంబై లతో పాటు.. లేటెస్ట్ గా లండన్ ప్రభాస్ కి మరో అడ్డాగా మారిందట. ఇటీవల లండన్ లో ఎక్కువ సమయం గడిపిన ప్రభాస్.. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. దాని కోసం లక్షల్లో అద్దె చెల్లిస్తున్నాడట. అయితే.. ప్రభాస్ లండన్ లోనే ఇల్లును తీసుకువడానికి ప్రత్యేకమైన కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

Related Posts