త్వరలో ‘టిల్లు 3’ అనౌన్స్ మెంట్ రాబోతుంది

సూపర్ హిట్టైన మూవీస్ క్రేజ్ ను సూపర్ లెవెల్ లో వాడుకోవడానికి సీక్వెల్స్ ట్రెండ్ మొదలుపెట్టారు మేకర్స్. హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఈ తరహా సీక్వెల్స్ ట్రెండ్ ఉంది. హాలీవుడ్ లోని కొన్ని మూవీ ఫ్రాంఛైజెస్ లో ఐదు, ఆరు, పది వరకూ సినిమాలు వచ్చిన సందర్భాలున్నాయి.

ఇక.. తెలుగులో ఇప్పుడిప్పుడు సీక్వెల్స్ సంప్రదాయం జోరందుకుంటుంది. గత కొన్ని సంత్సరాలుగా తెలుగులో సీక్వెల్స్ హిట్టైన దాఖలాలు తక్కువ. కానీ.. లేటెస్ట్ గా ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘డీజే టిల్లు’కి మించిన రీతిలో డబుల్ డోస్ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ‘టిల్లు స్క్వేర్’ థియేటర్లలో దూసుకెళ్తుంది.

ఈనేపథ్యంలోనే.. ‘టిల్లు’ ఫ్రాంఛైస్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సిరీస్ లో మూడో భాగాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు నిర్మాత నాగవంశీ. త్వరలోనే ‘టిల్లు 3’పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. మొత్తంమీద.. టాలీవుడ్ లో టిల్లు అనేది తన బ్రాండ్ నేమ్ గా మార్చుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

Related Posts