తడి అందాలతో రెచ్చిపోయిన తాప్సీ


హీరోగానో, హీరోయిన్ గానో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంటుందని చెప్పలేం. కానీ కొందరికి ప్రతిభ ఉన్నా అది ప్రదర్శించే అవకాశం తక్కువగా వస్తుంది. కొందరికి కెరీర్ మొత్తం కూడా కుదరదు. అలాగే తొలి సినిమాతో కేవలం స్కిన్ షోకే పరిమితమై.. తర్వాత అలాంటి పాత్రలు మాత్రమే చేసి.. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లింది తాప్సీ. అక్కడా గ్లామర్ పాత్రలతో మొదలుపెట్టి అత్యంత ప్రతిభావంతమైన పాత్రలను సులువుగా పోషిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది తాప్సీ పన్ను.

తాప్సీ పన్ను.. పంజాబీ మూలాలున్న కుటుంబంలో ఢీల్లీలోనే పుట్టి పెరిగింది. కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసిన తాప్సీ కాలేజ్ డేస్ నుంచే మోడలింగ్ చేసింది. ఆ తర్వాత వెండితెర ప్రయత్నాల్లో ఉండగా రాఘవేంద్రరావు దృష్టిలో పడింది. 2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం‘ తన తొలి సినిమా. మంచు మనోజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ట్రెడిషనల్ మ్యూజిక్ పై డాక్యుమెంటరీ చేసే ఎన్నారై గాళ్ పాత్రలో పూర్తి స్థాయి రాఘవేంద్ర రావు హీరోయిన్ గా నటించింది. తన రెండో సినిమాని సైతం మంచు కాంపౌండ్ లోనే చేసింది తాప్సీ. విష్ణు హీరోగా నటించిన ‘వస్తాడు నా రాజు‘లో తన క్యూట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

అప్పటికి రైజింగ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ సరసన ‘మిస్టర్ పర్ఫెక్ట్‘ లో ఛాన్స్ తనకు బ్రేక్ ఇస్తుందనుకుంది. కానీ సినిమా హిట్ అయినా మేజర్ క్రెడిట్ కాజల్ కు వెళ్లింది. అటుపై తెలుగులో ‘వీర, మొగుడు, గుండెల్లో గోదారి, దరువు, షాడో, సాహసం‘ వంటి సినిమాల్లో నటించింది. కానీ వీటిలో ‘సాహసం‘ తప్ప మిగతా వన్నీ కమర్షియల్ గా ఆకట్టుకోలేదు. తను ఎంట్రీ ఇచ్చిన కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటం, చేసిన సినిమాలు విజయంవంతం కాకపోవడంతో తను టాప్ లీగ్ లోకి ఎంటర్ కాలేకపోయింది. ‘ఝుమ్మంది నాదం‘ తర్వాత తమిళ్ లో ‘ఆడుకాలం‘ వంటి బిగ్గెస్ట్ హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. కానీ ఇంత పెద్ద సక్సెస్ తాప్సీకి తమిళ్ లో ఏ మాత్రం క్రేజ్ తేలేదంటే ఆశ్చర్యం కలగక మానదు.

2013లో ‘ఛష్మే బద్దూర్‘తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బేబీ‘ సినిమాతో తాప్సీ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ఆ వెంటనే ‘కాంచన2‘తో తమిళ్ లో సూపర్ హిట్ అందుకుంది. ఇక తాప్సీ కెరీర్ నే కాక, ఇమేజ్ ను కూడా పూర్తిగా మార్చేసిన సినిమా ‘పింక్‘. తనపై జరిగిన లైంగిక దాడిని ప్రతిఘటించి.. ఆ వ్యక్తులపై కేస్ వేసి.. తర్వాత తనే బాధితురాలిగా మారిన యువతి పాత్రలో తాప్సీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ‘నామ్ షబానా, జుడ్వా2, బద్లా, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్‘ వంటి చిత్రాలు బాలీవుడ్ లో తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి.

మరోవైపు తెలుగులో కూడా ‘ఘాజీ, ఆనందోబ్రహ్మ, నీవెవరో, గేమ్ ఓవర్, మిషన్ ఇంపాజిబుల్‘ వంటి సినిమాలు చేసింది. పుష్కరకాలానికి పైగా కథానాయికగా కొనసాగుతోన్న తాప్సీ కెరీర్ ఇప్పుడు డల్ ఫేజ్ లో ఉందని చెప్పొచ్చు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘శభాష్ మిథు‘ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ‘దొబారా, తడ్కా, బ్లర్‘ వంటి సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును సాధించలేదు. ఇక ‘బ్లర్‘ మూవీతో తాప్సీ ప్రొడ్యూసర్ గా కూడా మారింది.

ప్రస్తుతం తాప్సీ కిట్టీలో నాలుగు బాలీవుడ్ మూవీస్ ఉన్నా వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘డంకీ ‘. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో తాప్సీ నటిస్తున్న సినిమా ఇది. రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈమధ్య వరుసగా సీరియస్ రోల్స్ లో మగరాయుడిలా తయారైన తాప్సీ మళ్లీ ఇప్పుడు గ్లామర్ బాట పడుతున్నట్టు లేటెస్ట్ పిక్స్ ను బట్టి తెలుస్తోంది. ట్రాన్స్ పరెంట్ శారీలో తడి తడి అందాలతో రెచ్చిపోయిన తాప్సీ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ పిక్స్ ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది ఈ అందాల సుందరి.

Related Posts