ఏప్రిల్ 12న వస్తోన్న ‘శ్రీ‌రంగ‌నీతులు‘

టాలెంటెడ్ యంగ్ యాక్టర్స్ సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్ హీరోలుగా.. రుహానీ శర్మ మరో కీలక పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరంగనీతులు‘. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ ఈ చిత్రానికి దర్శకుడు. రాధావి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న ‘శ్రీరంగనీతులు‘ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం, ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీమ్. నేటి యువ‌త ఆలోచ‌న‌లు, కుటుంబ బంధాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిదని.. యువ‌త‌రం భావోద్వేగాలు, సహజంగా ఉండే పాత్రలు, మనసుకి హత్తుకునే సన్నివేశాలతో ‘శ్రీరంగనీతులు‘ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది

Related Posts