‘నా సామిరంగ’ నుంచి వరుసగా రానున్న సాంగ్స్

‘బంగార్రాజు’తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడనుకున్న నాగార్జునను ‘ది ఘోస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో తన ఫోకస్ అంతా అప్ కమింగ్ మూవీ ‘నా సామిరంగ’పైనే పెట్టాడు. ఆగస్టులో అనౌన్స్ అయ్యింది మొదలు ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుంటుంది. మరికొద్ది రోజుల్లో దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వనుందట. సంక్రాంతి టార్గెట్ గా రాబోతున్న ‘నా సామిరంగ’ ప్రచారంలో స్పీడు పెంచబోతున్నారట మేకర్స్.

నాగార్జునతో గతంలో పలు సూపర్ హిట్స్ అందించిన కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తం ఈ సినిమాలో ఐదు పాటలుంటాయట. డిసెంబర్ నుంచి వరుసగా ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట టీమ్. ఈ సినిమా నుంచి ముందుగా ఓ మెలోడీ సాంగ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా ఆషిక రంగనాథ్ నటిస్తుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts