భారీ బిజినెస్ చేసిన స్కంద

కొన్ని సినిమాలకు వచ్చే హైప్ అంచనాలకు అందదు. ముఖ్యంగా ఇమేజ్ లను కూడా దాటి వెళ్లినప్పుడు విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. అలాంటి ఆశ్చర్యానికే కారణమైంది. స్కంద. మేకర్స్ కూడా ఊహించారో లేదో .. ఓ రేంజ్ లో బిజినెస్ అయింది. థియేట్రికల్ తో పాటు నాన్ థియేట్రికల్ గా కూడా చూస్తే ఏకంగా 158 కోట్లకు డీల్ ఫైనల్ అయింది. ఈ ఫిగర్ చూస్తే ఆశ్చర్యం కాదు.. కొందరికి షాకింగ్ గానూ అనిపిస్తుంది.

ఇందులో నాన్ థియేట్రికల్ రైట్స్(కంట్రీ మొత్తం) స్టార్ గ్రూప్ 98 కోట్లకు తీసుకుంది. స్టార్ గ్రూప్స్ లో ఈ సినిమా ప్రసారం అవుతుందన్నమాట. ఇక థియేట్రికల్ గా 60 కోట్లకు ఫైనల్ అయిపోయింది. ఓవరాల్ గా 158 కోట్లు. అంటే నిర్మాతకు కంప్లీట్ గా టేబిల్ ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట.


బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఈ ఇద్దరి ఇమేజ్ లను బట్టి చూస్తే ఈ కాంబినేషనే ఆశ్చర్యపరిచింది. అయితే ట్రైలర్ వరకూ ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. ట్రైలర్ చూసిన తర్వాత కంప్లీట్ బోయపాటి మార్క్ లోనే ఊరమాస్ గా ఉంది.

బోయపాటి హీరోగా రామ్ సెట్ అవుతాడా అనుకున్నవాళ్లు కూడా ఓకే అనుకున్నారు. అందుకే సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఈ హైప్ ను ఇమ్మీడియెట్ గా క్యాష్‌ చేసుకున్నాడు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. అటు థమన్ మ్యూజిక్ లో పాటలు ఆకట్టుకోలేదు. బట్ ఆర్ఆర్ ఎప్పట్లానే అదిరిపోతుందంటున్నారు.


రామ్ సరసన శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ మాత్రం కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. సినిమా ఏ మాత్రం బావుంది అన్న టాక్ వచ్చినా థియేట్రికల్ రికవర్ కష్టమేం కాదు. బట్ తేడా కొడితే మాత్రం నెక్ట్స్ డేకే సమస్య తప్పదు. పైగా అదే టైమ్ లో చంద్రముఖి2 తో పాటు విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఏది బావున్నా.. స్కందకు సమస్యలు తప్పవు. బట్ ఈ ఫిగర్ ను సాధిస్తే రామ్ కూడా నెక్ట్స్ లీగ్ లోకి ఎంటర్ అవుతాడు.

Related Posts