వ్యక్తిత్వం, విలువల కలబోత చినబాబు

కొన్ని బ్యానర్స్ పేరు చెబితే తెలియకుండానే రెస్పెక్ట్ పెరుగుతుంది. అది ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలను బట్టి కలిగే గౌరవం అది. సంస్కారవంతమైన సకుటుంబ కథా చిత్రాలతో అతి తక్కువ కాలంలోనే ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న ఆ సంస్థ హారిక అండ్ హాసిని. త్రివిక్రమ్ చేతులమీదుగా నామకరణం చేసుకుని.. ఆయనతో మాత్రమే సినిమాలు తీస్తూ.. అఖండ విజయాలు సాధిస్తూ.. అప్రతిహతంగా కొనసాగుతోన్న హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు పుట్టిన రోజు ఇవాళ.


పాతికేళ్ల క్రితమే ఆత్మకథ అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టారు చినబాబు. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ సరికొత్త కథలతో ప్రయాణం ప్రారంభించారు. సహ నిర్మాతగా స్టార్ట్ చేసి సరైన కథ ఎంచుకుని సోలోగా నిర్మాణం మొదలుపెట్టారు. తనకెంతో ఇష్టమైన త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు చేస్తా అని తన స్నేహంతో ఆయన్నీ ఒప్పించి అలాగే ముందుకు వెళుతున్నారు. తొలి సినిమా నుంచే తాము ప్రత్యేకం అని అని ప్రూవ్ చేసుకున్నారు. అతి తక్కువ టైమ్ లోనే అద్భుతమైన సినిమాలకు ఆలవాలంగా తమ బ్యానర్ ను మార్చారు. హారిక హాసినిలో సినిమా అంటే.. అది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఫిక్స్ అయింది.


అభిరుచి కలిగి, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే చినబాబు కథల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. అందుకే అల్లు అర్జున్ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ తీసినా.. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో అ ఆ వంటి సినిమా తీసినా అది ఆయనకే చెల్లింది..


తన బ్యానర్ త్రివిక్రమ్ కే అంకితం, పరిమితం. అందుకే మిత్రుడు ప్రసాద్, సోదరుడి తనయుడు నాగవంశీతో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ లో ఇండస్ట్రీలోని అందరు దర్శకులతో సినిమాలు వస్తున్నాయి. ఇక్కడా అంతే. కథే ప్రధానం. అదే సితారనూ ది బెస్ట్ బ్యానర్ గా నిలిపింది.


సినిమా పరిశ్రమలో, మంచి వ్యక్తిత్వం, విలువలు కలిగి ఉన్న నిర్మాతలు అరుదు. ఆ అరుదైన వారిలోనూ అగ్రభాగంలో ఉండే పేరు సూర్య దేవరరాధాకృష్ణ. చాలా తక్కువ సమయంలోనే ఎంతోమందికి ఆదర్శ నిర్మాతగా నిలిచారు. ఆయన మాట్లాడేది తక్కువ. ఆయన సినిమాల గురించి మాట్లాడుకునేది ఎక్కువ. కలెక్షన్ల రికార్డుల కంటే కంటెంట్ లోని వాల్యూస్ గురించే ప్రేక్షకులు మాట్లాడుకోవాలి అని నమ్మి ఆచరిస్తూ అడుగులు వేస్తోన్న అద్భుతమైన నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబుగారికి తెలుగు 70ఎమ్ఎమ్ తరఫున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Related Posts