సమంత, నిహారిక రూట్ లో కలర్స్ స్వాతి

కుటుంబాల్లో కలహాలు కామన్. మనస్ఫర్థలు లేని మనుషులు ఉండరు. కలిసి ఉండాలంటే కాస్త సహనం అవసరం. లేదూ అనుకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ లు డిలేట్ చేసుకోవడం. ఇదే ఇప్పటి ట్రెండ్. విడిపోతున్నాం అని ఎవరికీ నేరుగా చెప్పక్కర్లేకుండా కలిసి ఉన్నప్పటి ఫోటోస్ డిలీట్ చేయడమో లేక కనిపించకుండా దాచేయడమో చేస్తే సరి. ఇక వీళ్లు విడిపోతున్నారహో అని సోషల్ మీడియా అంతా చాటింపు వేయించినట్టే.

ఈ ట్రెండ్ ను మొదలుపెట్టింది సమంత. నాగ చైతన్యతో విడిపోతున్నారు అని తెలిసిన మరుక్షణంలో అతనితో కలిసి ఉన్న ఫోటోస్, వీడియోస్ అన్నీ డిలేట్ చేసింది. పెళ్లి తర్వాత పెట్టుకున్న అక్కినేని అనే పేరును కూడా తొలగించింది. అసలేం జరుగుతుందా అని సోషల్ మీడియాతో పాటు మీడియాలో జనం జుత్తు పీక్కుఉన్నారు. ఆఖరికి ఆరు నెలలకు మేం విడిపోయాం అనే ఓ కార్డ్ ముక్క సైజ్ మాటలను అదే సోషల్ మీడియాలో పెట్టారు. పైగా అప్పటి వరకూ జనమేదో వారిని ఇబ్బంది పెట్టినట్టు.. “మాకు ప్రైవసీ” వదలండి అనే స్టేట్మెంట్ ఒకటి తగిలించారు.

ఇక సమంత చైతన్యాన్ని నిహారిక కూడా అందిపుచ్చుకుంది. 2021లో చైతన్య అనే కుర్రాడితో రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. కట్ చేస్తే ఈ యేడాది ఆరంభం నుంచి ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. అంతే ఈవిడ కూడా సోషల్ మీడియాలో ఫోటోస్ తీసేసింది. ఆల్రెడీ అర్థమైంది కాబట్టి.. మరీ హడావిడీ లేకుండా జనం కూడా ఓ.. వీళ్లూ విడిపోతున్నారన్నమాట అనుకున్నారు. మరి వారి మాటను గౌరవిస్తూ.. ఈ జంట కూడా ఈ నెలలోనే కోర్ట్ ద్వారా విడాకుల తీసుకున్నారు.

సో సమంత క్రియేట్ చేసిన ట్రెండ్ ను కొనసాగించిన నిహారిక చైతన్యాన్ని ఇప్పుడు కలర్స్ స్వాతి కూడా అందిపుచ్చుకుంది అంటున్నారు. కలర్స్ స్వాతి కూడా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో నుంచి భర్త ఫోటోస్ డిలీట్ చేసింది. ఈవిడ 2018లో వికాస్ వాసు అనే మళయాలీని పెళ్లి చేసుకుంది. అతగాడు కమర్షియల్ పైలెట్. పెళ్లి తర్వాత రెండేళ్లకే వీళ్లు విడాకులు తీసుకుంటున్నారు అనే రూమర్స్ వచ్చాయి. అప్పట్లో అవి సద్దమణిగాయి. కానీ ఇప్పుడు తను కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్ డిలీట్ చేసింది కాబట్టి.. త్వరలోనే ఈ స్వాతి విడాకుల ప్రకటన కూడా వస్తుందన్నమాట.

విశేషం ఏంటంటే.. ఇదే విషయంపై ఆమెను ఓ మీడియావాళ్లు ప్రశ్నించారట. దానికి ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. చెప్పాల్సిన టైమ్ వస్తే చెబుతాను అందట. మరి ఆటైమ్ ఏంటో మనకు తెలియదా..? ఆరు నెలల తర్వాత మేం విడిపోయాం.. మాకు ప్రైవసీ కావాలి… ఇదే కదా..? కాదూ అంటే ఆ ముక్కే చెప్పాలి కదా.. కాబట్టి కలర్స్ స్వాతి కూడా సమంత బాటలో ప్రయాణం చేయబోతోందన్నమాట.

Related Posts