తెలుగు యంగ్ డైరెక్టర్స్ లో బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ను అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ కు చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ అ తో ఒక వైవిధ్యమైన ‘కథనం’ ప్రయత్నించాడు. అటుపై కల్కితో దర్శకుడుగా ఇంప్రెస్ చేశాడు. జాంబిరెడ్డితో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ మూడూ భిన్నమైన చిత్రాలు. ప్రతి సినిమాలోనూ అతని టేకింగ్ మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు హను మాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. మైథలాజికల్ ఫిక్షన్ జానర్ లో వస్తోన్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. ఆ మధ్య ఆదిపురుష్ ఫస్ట్ టీజర్ తర్వాత వచ్చిన ఈ మూవీ టీజర్ చూసి కంట్రీ మొత్తం ఫిదా అయింది. లిమిటెడ్ బడ్జెట్ తోనే అన్ లిమిటెడ్ క్వాలిటీ టీజర్ కే చూపించాడు. సెల్యూలాయిడ్ పై ఓ విజువల్ వండర్ ను చూడబోతున్నాం అనిపించాడు. అప్పటి నుంచీ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అంతా ఈగర్ గా చూస్తున్నారు.
హను మాన్ ను సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నారు అని కొన్నాళ్లుగా చెబుతూనే వస్తున్నారు. బట్ సంక్రాంతికి భారీ పోటీ ఉంది. వీళ్లు చూస్తే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా.. ఆ కటౌట్స్ ఓపెనింగ్స్ తెచ్చేవి కావు. అందుకే రిస్క్ చేస్తున్నారా అనుకున్నారంతా. బట్ రిస్క్ చేస్తేనే కదా అనుకున్నారు. వీళ్లు సంక్రాంతికే ఫిక్స్ అయిపోయారు. ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో జవనరి 12న విడుదల చేస్తున్నట్టు మరోసారి ఖచ్చితంగా చెప్పారు. సో.. ఇప్పటి వరకూ సంక్రాంతి బరిలో ఉన్న ఫిక్స్ డ్ గా ఉన్న చిత్రాలు రవితేజ ఈగిల్, గుంటూరు కారం, నాగార్జను నా సామిరంగా చిత్రాలు. వీటితో పాటు కల్కి 2898ఏడి ఉంటుందని చెప్పినా.. ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే. సో.. మైథలాజికల్ ఫిక్షన్ గా వస్తోన్న హను మాన్ కు ఈ సీజన్ కు బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హను మాన్ లో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.