పైరసీ పై సంచలన బిల్ .. ఇక జైలుకే

పైరసీ.. ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు కానీ పదేళ్ల క్రితం ఈ పదం వింటేనే అన్ని సినిమా పరిశ్రమలు వణికిపోయాయి. కొందరైతే ఛాలెంజ్ చేసి మరీ రిలీజ్ డేట్ ఫస్ట షో ముగియకుండానే పైరసీ చేసి మార్కెట్లో పెట్టారు. దీనికి వ్యతిరేకంగా అన్ని భాషల హీరోలు గళం విప్పారు. పోలీస్ స్టేషన్స్ లో కేస్ లు పెట్టారు. అయినా ఆపలేకపోయారు. కాలం మారింది. టెక్నాలజీ మారిందిం. దీంతో ఇక పైరసీ రూపం మార్చుకుంది.

ఇప్పుడు రకరకాల యాప్ లు వచ్చాయి. సైట్స్ వచ్చాయి. ఆయా సైట్స్, యాప్స్ లో ఈ తరహా దందా కొనసాగుతూనే ఉంది. రిలీజ్ రోజునే సినిమా మొత్తం మరింత క్వాలిటీతో బయటకు వస్తోందిప్పుడు. అయితే రిలీజ్ కు ముందే అమ్మేసుకోవడంతో నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. డిజిటల్ రైట్స్ తీసుకున్నవారు, శాటిలైట్ రైట్స్ తీసుకున్నవాళ్లు ఇప్పుడు ఎక్కువగా నష్టపోతున్నారు. దీంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తెచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సంచలన బిల్ ను కూడా పాస్ చేశారు. ఈ బిల్ అమలైతే ఇక పైరసీకారుల గుండెల్లో గుబులు మొదలైనట్టే.


ఎవరైనా సినిమాను పైరసీ చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఆ సినిమా నిర్మాణ వ్యయంలో 5శాతం చెల్లించాలి. మొదటిది ఏమో కానీ రెండో నిబంధన మాత్రం నిర్మాతలతో పాటు డిజిటల్ ఓనర్స్ కు పండగే. పది కోట్ల సినిమాకు 20 కోట్ల బడ్జెట్ అని చెబుతారు. అప్పుడు పైరసీదారులే 5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

వీళ్లు మాత్రమే కాదు.. ఇకపై సినిమా మొదలు కాగానే టైటిల్ కార్డ్ నుంచి చిన్న చిన్న సీన్స్ ను రికార్డ్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ, వాట్సాపుల్లోనూ పెడుతున్నారు కొందరు. వీళ్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారట. చూస్తోంటే ఈ సారి బలమైన నిర్ణయాలే తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ అమలు చేయడమే పెద్ద టాస్క్. అన్నట్టు.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పైరసీగాళ్లు ప్రత్యామ్నాయాలు చూస్తుంటారు కదా..? సో.. ఇది నిరంతర ప్రక్రియగానే చూడాలి.

Related Posts