సేవ్‌ ద టైగర్ 2 గ్రాండ్ ప్రివ్యూ

సేవ్ ద టైగర్ వెబ్‌సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వెబ్‌సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు సిద్దమైంది. మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం కలిసి క్రియేట్ చేసిన ఈ కంటెంట్ కు అరుణ్ కొత్తపల్లి డైరెక్షన్‌ చేసారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, సీరత్‌ కపూర్‌లు మెయిన్ లీడ్ చేసిన ఈ వెబ్ సిరీస్ సీజన్‌ 2 హాట్‌స్టార్ డిస్నీ ప్లస్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్ ప్రివ్యూను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది యూనిట్.


ఓ వెబ్‌సిరీస్‌ సీజన్‌2 గురించి మాట్లాడుకుని ఓకే చేయించుకున్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే అన్నారు మహి వి రాఘవ. అందుకు హాట్‌స్టార్ డిస్నీప్లస్ వారికి థ్యాంక్స్‌ అన్నారు. ఈ వెబ్‌సిరీస్‌ని యాక్టర్స్ ఓన్ చేసుకుని మరీ నటించారు. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్ గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సీజన్ 1 చేసిన ప్రదీప్ కు, ఇప్పుడు సీజన్ 2కు డైరెక్షన్ చేసిన అరుణ్ కు థ్యాంక్స్. ఈ సెకండ్ సీజన్ కూడా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారాయన.
ఫస్ట్ సీజన్‌కు మించి సీజన్‌ 2 ఆకట్టుకునేలా చేయగలమా లేదా అనే టెన్షన్‌తో ఈ సీజన్‌ ను మొదలుపెట్టామన్నారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ మాకు వదిలిపెట్టిన హాట్‌స్టార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు ప్రదీప్‌ అద్వైతం.


ఫస్ట్ సీజన్ కంటే బాగా రావాలని మా టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రతి సీన్ కూడా జాగ్రత్తగా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్‌ సీజన్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత సెకండ్ సీజన్‌ డైరెక్షన్‌ చేసే చాన్స్ తనకు ఇచ్చిన మహి వి రాఘవ, హాట్ స్టార్‌, ప్రదీప్ అద్వైతం లకు చాలా థ్యాంక్స్‌ అన్నారు డైరెక్టర్‌ అరుణ్‌ కొత్తపల్లి.

Related Posts