12 వ ఆల్‌ఇండియా బ్రిడ్జ్‌ టోర్నమెంట్ లాంచ్ చేసిన హీరో నిఖిల్

సినిమాలు, రాజకీయాలే కాదు.. స్పోర్ట్స్‌ కు కూడా విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే సినీ సెలబ్రిటీలు క్రికెటర్స్‌ కలిసి ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్‌ టోర్నమెంట్ కూడా సినిమాలతో ముడిపెడుతూ.. జనాల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అలా 12 వ ఆల్‌ఇండియా బ్రిడ్జ్‌ టోర్నమెంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. FNCC లో జరిగిన ఈ కార్యక్రమానికి కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

చైనాలో జరిగిన టోర్నమెంట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్ ఎన్ సి సి ఘనంగా సత్కరించింది. 69 టీమ్‌లో పాల్గొనబోతున్న ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో , ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ శ్రీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు గారు, శ్రీ ఏడిద సతీష్ (రాజా) గారు, ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ శ్రీ చాముండేశ్వరనాథ్ గారు పాల్గొన్నారు.
టోర్నమెంట్‌లో పాల్గొనే టీమ్స్ కు ఆల్‌ది బెస్ట చెప్తూ.. ముఖ్య అతిధిగా విచ్చేసిన హీరో నిఖిల్‌కు ధన్యవాదాలు చెప్పారు FNCC వైస్ ప్రెసిడెంట్ రంగారావు గారు.


ఒక యాక్టర్ ని అయినా తనను ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ కి పిలిచిన FNCC సెక్రటరీ ముళ్లపూడి మోహన్ గారికి థ్యాంక్స్ చెప్పారు హీరో నిఖిల్. ఇలాంటి ఈవెంట్స్ కి రావడం మైండ్ ర�