‘సముద్రుడు ‘ ట్రైలర్ రిలీజ్‌

రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సముద్రుడు”. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కు నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ను లాంచ్ చేసారు.
మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిదన్నారు డైరెక్టర్‌ నగేష్ నారదాసి. సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం అన్నారాయన.
ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని విశ్వాసం తో చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశామన్నారు .. హీరో రమాకాంత్‌.
.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన లు పాల్గొన్నారు.

Related Posts