సామజవరగమనా.. సరైన స్ట్రాటజీయేనా

ప్రీమియర్స్.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితం. కానీ ట్రెండ్ మారింది. ప్రమోషన్ వేటలో సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఆ ప్లాన్స్ వర్కవుట్ అయితే అదే ట్రెండ్ అవుతుంది కదా..? ఇప్పుడు ఈ ప్రీమియర్స్ ట్రెండ్ లోకి శ్రీ విష్ణు సామజవరగమనా కూడా ఎంటర్ అవుతోంది.

కొన్నాళ్ల క్రితం కన్నడ సినిమా చార్లీ, మన సినిమాలు మేజర్, రైటర్ పద్మభూషణ్ వంటి చిత్రాలను రిలీజ్ కు చాలా రోజుల ముందే ప్రీమియర్స్ వేసి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మామూలుగా ప్రీమియర్స్ అంటే రిలీజ్ కు ఒకరోజు ముందు రాత్రి లేదా అదే రోజు తెల్లవారు ఝామున ఉంటాయి. కానీ వీళ్లు నాలుగైదు రోజులు ముందే సాధారణ ప్రేక్షకులకు ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని దాన్ని ప్రమోషన్ కోసం వాడుకున్నారు.

సామజవరగమనా టీమ్ కూడా అదే చేయబోతోంది.
ఈ సోమవారం రోజున సామజవరగమన మూవీ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతోంది. తెలంగాణలో ఇంకా ఖరారు కాలేదు కానీ ఏపిలో మాత్రం తిరుపతి, వైజాగ్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కడప, ఏలూరు, కర్నూలు, కాకినాడ, కర్నూలు నగరాల్లో చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

అన్ని చోట్లా సరిగ్గా సాయంత్రం 7.30 గంటలకు ప్రదర్శన మొదలవుతుంది. ఆ తర్వాత ఆడియన్స్ కు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి.. ప్రమోషన్స్ మరింత ఊపందుకుంటాయి. ఏదేమైనా వీళ్లు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఆల్రెడీ వర్కవుట్ అయిందే కాబట్టి.. ఖచ్చితంగా ఈ చిత్రానికీ ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా చెబితే చిన్న సినిమాలకు సంబంధించి ఇది మంచి ప్లాన్ కూడా.

Related Posts