హీరోయిన్ ను చేయమంటే పెళ్లి చేస్తున్నాడు..

ఎక్కడో ఉండి.. వెండితెరపై ఆర్టిస్టులను చూసి.. తాము కూడా అలా కావాలని కలలు కంటూ సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటారు చాలామంది. వచ్చిన అందరూ సక్సెస్ కాలేరు. చాలామంది సరైన ప్రయత్నాలు కూడా చేయరు. అలాంటిది.. ఇండస్ట్రీలోనే ఉన్నవారికి మాత్రం ఆ కోరిక ఉండదా..? ముఖ్యంగా వారసులకు. అయితే వారసులు అనగానే హీరోల కొడుకులే గుర్తొస్తారు కానీ కూతుళ్లు కాదు.

తాను అందుకు భిన్నం అంటూ తన కూతురును హీరోయిన్ ను చేశాడు యాక్షన్ కింగ్ అర్జున్. 2013లోనే పట్టాత్తు యానై అనే తమిళ్ మూవీతో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను హీరోయిన్ గా చేశాడు అర్జున్. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.

తర్వాత కన్నడలో ఓ సినిమా, తమిళ్ లో మరో సినిమా చేసింది. బట్ ఆమె లుక్స్ కు హీరోయిన్ గా సెట్ అవదు అని తేల్చారు విమర్శకులు. అయినా తన ప్రయత్నాలు ఆపలేదు. దీంతో స్వయంగా యాక్షన్ కింగ్ అర్జునే రంగంలోకి దిగాడు. ఆ మధ్య తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఆ మూవీలో తన కూతురునే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేయాలనుకున్నాడు.

ఈ మేరకు టాలీవుడ్ పెద్దల ఆశిస్సులు కూడా కూతురుకు ఇప్పించాడు. కానీ విశ్వక్ సేన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. రకరకాల ఇష్యూస్ జరిగడంతో ఏకంగా మూవీ ఆగిపోయింది. ఇక ఇదంతా ఎందుకు అనుకున్నాడేమో.. అర్జున్ తన కూతురుకు పెళ్లి చేయబోతున్నాడు.


ఉమాపతి రామయ్య అనే వ్యక్తితో ఐశ్వర్య అర్జున్ పెళ్లి జరగబోతోంది. ఈ ఉమాపతి తమిళ్ కమెడియన్, క్యారెక్టర్ తంబి రామయ్య కొడుకు కావడం విశేషం. తంబి రామయ్య బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఈ ఉమాపతి కూడా నటుడుగా తెరంగేట్రం చేశాడు. సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు.

కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారట. త్వరలోనే రెండు కుటుంబాల నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మొత్తంగా తన కూతురును స్టార్ హీరోయిన్ ను చేయాలని ట్రై చేసినా కుదరక ఇక పెళ్లి చేయబోతున్నాడు అర్జున్. కాకపోతే మళ్లీ ఆమెను కూడా సినిమా ఫ్యామిలీలోకే కోడలిగా పంపిస్తున్నాడు. మరి ఆ తర్వాత తను భర్త, మామ ప్రోత్సాహంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏవైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.

Related Posts