‘సలార్’ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

‘సలార్’ రిలీజ్ కు ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే ఉంది. ఇటీవలే ఈ చిత్రంలోని ఐటెం నంబర్ ను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇకపై ప్రమోషన్స్ లో జోరు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీమ్.

డిసెంబర్ 1న ‘సలార్’ ట్రైలర్ ను గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ‘సలార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరుగుతుంది. సౌత్ లో ‘సలార్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్న డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ను ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తుంది చిత్రబృందం.

కన్నడలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓన్ రిలీజ్ చేస్తుండగా.. కేరళలో పృథ్వీరాజ్ కి సంబంధించిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించిన రెడ్ జయంట్ మూవీస్ భారీ స్థాయిలో ‘సలార్’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ గా ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ వచ్చింది.

‘సలార్’ ఆంధ్ర ఏరియాలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. సీడెడ్ కాకుండా కేవలం ఆంధ్రలోనే ఈ సినిమా రూ.85 కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రూ.20 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉందట.

ఇక.. ఉత్తరాంధ్రలో ఈ చిత్రాన్ని సిరి సాయి సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే.. తూర్పు గోదావరి – లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిల్మ్స్, పశ్చిమ గోదావరి – గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణ, గుంటూరు – కె.ఎస్.ఎన్. టెలీ ఫిల్మ్స్, నెల్లూరు – శ్రీ వెంగమాంబ సినిమాస్, సీడెడ్ శిల్పకళా ఎంటర్ టైన్ మెంట్స్ ‘సలార్’ రైట్స్ దక్కించుకున్నాయి. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ‘సలార్’ డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Related Posts