అనగనగా ఒక రాకుమారుడు

జానపద కథానాయకునిగా తనదైన బాణీ పలికించిన కాంతారావు.. జనం మదిలో కత్తి కాంతారావుగా నిలిచిపోయారు. నవంబర్ 16న కాంతారావు జయంతి. కాంతారావు పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మదిలో ఆయన కత్తి తిప్పే విన్యాసాలే ముందుగా గుర్తుకొస్తాయి. హెచ్.ఎమ్.రెడ్డి తెరకెక్కించిన ‘ప్రతిజ్ఞ’ జానపద చిత్రంలో కథానాయకునిగా పరిచయమయ్యారు కాంతారావు.

హీరోగానే కాకుండా, కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గానూ కాంతారావు ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తరువాత అత్యధిక జానపద చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత కాంతారావు ది. అలాగే ఎన్టీఆర్ తరువాత ఎక్కువ సినిమాల్లో కృష్ణుని వేషం వేసిందీ కాంతారావే. ఇక నారద పాత్రలో కాంతారావు అభినయం నభూతో నభవిష్యతీ అనిపించింది.

నిర్మాతగానూ కాంతారావు ‘సప్తస్వరాలు, , గండర గండడు, ప్రేమజీవులు, స్వాతిచినుకులు’ వంటివి నిర్మించి అభిరుచిని చాటుకున్నారు. అయితే నిర్మాతగా కాంతారావు ఏనాడూ సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. తరువాతి రోజుల్లో కాంతారావు చిన్నచిన్న పాత్రలు కూడా పోషించారు.

ఏది ఏమైనా తెలుగువారి మదిలో మాత్రం కత్తి కాంతారావుగా సుస్థిరస్థానం సంపాదించారు. నేడు కాంతారావు లేకపోయినా ఆయన అభినయం మాత్రం తెలుగువారిని అలరిస్తూనే ఉంది.

Related Posts