సలార్ ట్రైలర్ డేట్ ఫిక్స్

బాక్సాఫీస్ బుల్డోజర్ ప్రభాస్ నటించిన సలార్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ రెండు చాప్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తోంది. ఫస్ట్ పార్ట్ కు సలార్ – సీజ్ ఫైర్ అనే టైటిల్ పెట్టారు. సెప్టెంబర్ 28న వాల్డ్ వైడ్ గా విడుదల కాబోతోన్న ఈమూవీ ఓవర్శీస్ లోఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇంకా ట్రైలర్ కూడా రాకపోయినా రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా రూపొందిస్తున్నారు. అంటే డైరెక్ట్ ఇంగ్లీష్ లో డబ్ అయిపోతుందన్నమాట. ఇటు ఇండియా మొత్తం సలార్ కోసం ఈగర్ గా చూస్తోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినా ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదనీ.. సరైన అప్డేట్ ఇవ్వడం లేదనీ ఫ్యాన్స్ అంతా కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హడావిడీ చేస్తున్నారు. ఓ దశలో నిర్మాణ సంస్థ, దర్శకుడిపైనా ఫైర్ అయ్యారు.. అవుతున్నారు కూడా. వారి కోసమే ఈ అప్డేట్.


సలార్ ట్రైలర్ ను సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నారు. ముందు నుంచీ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తాం అని చెబుతున్నారు. అయితే ఒకటీ రెండు మూడు తారీఖుల్లో ఉంటుందనుకున్నారు. బట్ 7న విడుదల చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 7న ట్రైలర్ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారట. అయితే ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ ఉంటాడా లేదా అనే డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది.

కొంతమంది చెప్పినదాన్ని బట్టి ఈ మూవీ ప్రమోషన్స్ ను ఒక ఏజెన్సీకి ఇచ్చారట. ప్రశాంత్ నీల్ నుంచి ప్రభాస్ వరకూ ఆ ఏజెన్సీ వాళ్లు చెప్పినట్టే వినాలనే రూల్ ఉందట. అది ప్రభాస్ కు నచ్చలేదని.. అందుకే తను ఈ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయను అని చెప్పినట్టు సమాచారం. అయితే మేకర్స్ మాత్రం ప్రభాస్ వరకూ మినహాయింపు ఇస్తూ.. ఆయన్ని కూడా ప్రమోషన్స్ లో భాగస్వామ్యం అయ్యేలా చేయాలనుకుంటున్నారు. మొత్తంగా ఈ ట్రైలర్ తర్వాత సలార్ పై అంచనాలు ఇప్పుడున్నదానికంటే మూడు నాలుగు రెట్లు పెరుగుతాయనుకోవచ్చు.

Related Posts