సైకో గా వెంకటేష్ ఉగ్రరూపంతో ‘సైంధవ్‘

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో వెంకటేష్ ది సెపరేట్ రూట్. ఓ వైపు కథా బలం ఉన్న సీరియస్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కామెడీ ఎంటర్టైనర్స్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తుంటాడు. ఈ వెటరన్ యాక్టర్ ఇప్పుడు తన ప్రతిష్ఠాత్మక 75వ చిత్రంగా ‘సైంధవ్‘ చేస్తున్నాడు. ప్రకటించగానే పట్టాలెక్కిన ‘సైంధవ్‘ ఇప్పుడు టీజర్ తో రెడీ అయ్యింది.

టీజర్ విషయానికొస్తే.. చంద్రప్రస్థ, సౌత్ ఇండియా అంటూ ఓ ప్లేసులో వెంకటేష్ తన భార్య, పాప తో ఆహ్లాదంగా గడుపుతున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే.. సడెన్ గా విలన్ రోల్ లో నవజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ.. అంతా భీభత్సం.. 20 వేల మంది పిల్లలకు గన్ ట్రైనింగ్ ఇచ్చి.. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి డెలివరీ చేయడం.. వంటి విజువల్స్ తో సీరియస్ మోడ్ లోకి మారింది. ఇక.. విలన్లను ఎదుర్కొనేందుకు ఆ తర్వాత సైకో గా ఎంటరయ్యాడు వెంకీ. ‘వెళ్లేముందు చెప్పి వెళ్లా.. విన్లేదు.. అంటే భయం లేదు.. లెక్క మారుద్దిరా నా కొడకల్లారా..‘ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో వెంకటేష్ ఉగ్రరూపం టీజర్ లో ఆకట్టుకుంటుంది.

వెంకటేష్, నవజుద్దీన్ సిద్ధిఖీలతో పాటు శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, ముఖేష్ రుషి, జిషు సేన్ గుప్తా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘హిట్‘ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాని నిహారికా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. మొత్తంగా.. టీజర్ తో అంచనాలను భారీ స్థాయిలో పెంచేసిన ‘సైంధవ్‘.. సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts