విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. హీరో పాత్ర అంతలా ఎలివేట్ అవుతోంది. అందుకే.. హీరోలకు దీటైన విలన్లుగా.. మరో భాషలోని హీరోలను దించుతున్నారు. ఈకోవలోనే ప్రభాస్ ‘సలార్’ కోసం ప్రతినాయకుడిగా మారాడు మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్. మాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ద స్టార్ హీరోస్ గా చక్రం తిప్పుతున్న పృథ్వీరాజ్.. దర్శకనిర్మాతగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సలార్‘ నుంచి వరదరాజ మన్నార్ పాత్రలో కనిపించబోతున్న పృథ్వీరాజ్ లుక్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేసింది చిత్రబృందం. బొట్టు, ముక్కుకు రింగు పెట్టుకుని భయంకరంగా కనిపిస్తున్న పృథ్వీరాజ్ లుక్ ఆకట్టుకుంటుంది. ‘సలార్‘ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న విడుదలకానుంది.’
