సాయి పల్లవి కొత్త సినిమా..

విరాట పర్వం విడుదలై యేడాది దాటింది. కానీ ఇప్పటి వరకూ సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. అలాగని ఆఫర్స్ లేవా అంటే ఉన్నాయి. చాలామంది దర్శకులు ఆమెను అప్రోచ్ అయ్యారు. బట్ కథలు నచ్చలేదనో మరోటో కారణాలుగా చెప్పి కాదంది. దీంతో తను తెలుగు సినిమాలకు కావాలనే దూరంగా ఉంటోంది అనే వార్తలు రూమర్స్ గా మొదలయ్యాయి. మరోవైపు సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోంది.. అందుకే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిందని కొన్ని విపరీత వార్తలు సైతం వచ్చాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫైనల్ గా సాయి పల్లవి ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిందంటున్నారు. అది కూడా నాగ చైతన్య సరసన.


నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో హీరోయిన్ గా చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చాలామంది కీర్తి సురేష్ ని తీసుకుంటారు అన్నారు. తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరూ వినిపించింది. అయితే సినిమా టీమ్ కాజల్ ను కూడా అనుకుందట. ఆ విషయం హీరోయిన్ అనౌన్స మెంట్ వీడియోలో కనిపించింది. కాజల్, అనుపమ పేర్లను బోర్డ్ పై రాశాడు దర్శకుడు చందు మొండేటి.

బట్ ఈ ఇద్దరూ కాకుండా ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చిందనేది కొత్త వార్త. శ్రీ కాకుళంకు చెందిన కొందరు జాలరులు పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి అరెస్ట్ అవుతారు. చాలా రాయబారాల తర్వాత వారిని పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అల్లుకున్న ఈ కథకు బలమైన హీరోయిన్ కావాలి. అందుకే సాయి పల్లవిని తీసుకున్నారు అంటున్నారు.


సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించింది. వీరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కనిపించింది. అది ఈ సినిమాకు ఎసెట్ అవుతుంది. సాయి పల్లవి ఎలాంటి పాత్రైనా అలవోకగా చేస్తుంది. అందుకే తననే తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ టీమ్.. హీరోయిన్ స్క్రిప్ట్ తీసుకున్న విజువల్స్ చూపించారు కానీ.. ఫేస్ రివీల్ చేయలేదు. అందుకోసం మరికొంత టైమ్ తీసుకుంటారట. మొత్తంగా తను సాయి పల్లవే అనేది టాలీవుడ్ నుంచి స్ట్రాంగ్ గా వినిపిస్తోన్న మాట.

Related Posts