శభాష్ అట్లీ.. నీలా తెలుగువాళ్లు చేయలేరు

అట్లీ.. రాజా రాణి అనే చిన్ని సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బట్ఆ సినిమా చాలా పెద్ద ఇంపాక్ట్ వేసింది. తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఓ క్లాసిక్ సినిమా అన్న పేరు తెచ్చుకుంది తమిళ్ లో. లవ్ ఫెయిల్ అయితే లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు అనే కోణంలో సాగే ఈ సినిమా టాప్ స్టార్స్ ను కూడా ఆకట్టుకుంది.

అందుకే వెంటనే విజయ్ అవకాశం ఇచ్చాడు. అతనితో వరుసగా మూడు హిట్లు కొట్టాడు. విజయ్ తో ఒక్క సినిమా హిట్ కొడితేనే టాప్ డైరెక్టర్ అంటారు. అలాంటిది మూడు అంటే ఇంక చెప్పేదేముందీ.. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు.

కొన్నాళ్ల క్రితం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. బట్ సడెన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అక్కడ ఏకంగా షారుఖ్ ఖాన్ నే ఇంప్రెస్ చేసే కథ చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే ఈ కాంబోలో సినిమా స్టార్ట్ అయింది. జవాన్ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ట్రైలర్ కూడా వచ్చింది. ఇది చూశాక.. శభాష్ అట్లీ అనకుండా ఉండలేం.


అట్లీ ట్రైలర్ చూస్తే తమిళ్ వాళ్లు తమ మూలాలకు ఎంత వాల్యూ ఇస్తారో అర్థం అవుతుంది. ఎందుకంటే పేరుకు ఇది బాలీవుడ్ సినిమా అయినా దీనిలో నటించిన వారు, టెక్నీషియన్స్ అందరూ తమిళ్ వాళ్లే. అట్లీ కోరుకుంటే అక్కడి నుంచే ది బెస్ట్ టెక్నీషియన్స ను ఇస్తాడు షారుఖ్. బట్..అతను మాత్రం తనవారిని తీసుకువెళ్లి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు.

ప్రధానమైన విలన్ రోల్ సైతం విజయ్ సేతుపతితో చేయించాడు. హీరోయిన్ గా నయనతార, కీలక పాత్రలో ప్రియమణిని తీసుకున్నాడు. ఈ ఇద్దరూ మళయాలీలే అయినా.. తమిళ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయినవారు. ప్రస్తుత కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబుతో సైతం ఓ పాత్ర చేయించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సినిమాటోగ్రాఫర్ జికే విష్ణు ఇద్దరూ తమిళులే. ఇలా హిందీలో సినిమా చేస్తున్నా.. తన భాషకు చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే అతన్ని అందరూ శభాష్ అట్లీ అంటున్నారు.


నిజానికి తెలుగులో ఇలా ఎవరూ ఇప్పటి వరకూ చేయలేదు. ప్యాన్ ఇండియన్ సినిమా అనగానే పోలోమని ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ వరకూ ఇతర భాషల వారిపైనే డిపెండ్ అవుతున్నారు. ఇప్పటికీ తెలుగులో సంగీత దర్శకులు అంటే వేరే భాషవాళ్లు మాత్రమే హవా చేస్తున్నారు తప్ప. మనవాళ్లెవరూ మనవారికి అవకాశాలే ఇవ్వడం లేదు. ఏదేమైనా ప్రాంతీయ, భాషాభిమానం డైలాగ్స్ లో ఉంటే కాదు.. ఇలా అట్లీలా యాక్షన్ లోనూ చూపిస్తేనే దానికి ఓ అర్థం ఉంటుంది.

Related Posts