కొత్త క్రాఫ్ట్ లోకి రామ్- లక్ష్మణ్ మాస్టర్స్

తెలుగు సినిమా పరిశ్రమలో ఏ అండా లేకుండా.. కనీస చదువు కూడా లేకుండా ఎదిగిన వాళ్లలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ముందుంటారు. విపరీతమైన కష్టంతోనే వాళ్లు ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఏంటో వీరిని చూసే నేర్చుకోవాలి. ప్రస్తుతం తెలుగులోనే కాదు.. సౌత్ లోనే టాప్ యాక్షన్ డైరెక్టర్స్ లో వీరూ ఉన్నారు. ఒకప్పుడు ఫైటర్స్ గా ఉన్న వీళ్లు ఆ తర్వాత మాస్టర్స్ గా ఎదిగారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డామని చాలాసార్లు చెప్పుకున్నారు. ఇండస్ట్రీలో చాలామందికి ఆ విషయం తెలుసు కూడా.

అయితే ఈ అన్నదమ్ములిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా మారిన తర్వాత హీరోలుగానూ కొన్ని సినిమాల్లో నటించారు. అప్పట్లో శ్రీహరిని ఆదర్శంగా తీసుకుని వీరు హీరోలుగా మారారు. అలా యాక్షన్ నెంబర్ వన్, ఖైదీ బ్రదర్స్, ఒక్కడే కానీ ఇద్దరు వంటి సినిమాల్లో హీరోలుగా నటించారు. బట్ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా స్టంట్ మాస్టర్స్ గానే కంటిన్యూ అవుతున్నారు.

కొన్నాళ్ల క్రితం ఈ అన్నదమ్ములిద్దరూ ఆధ్మాత్మిక మార్గంలోకి ఎంటర్ అయ్యారు. ధ్యానయోగ కేంద్రాలు స్థాపించడం.. దాని గురించి అందరికీ వివరించడం చేస్తున్నారు. రీసెంట్ గా యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఓ పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. వీటి తర్వాత వారి కెరీర్ లో ఓ కొత్త మలుపు చోటు చేసుకోబోతోంది.


రామ్ లక్ష్మణ్ లు త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అది కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా. ఆ మధ్య శ్రీనివాస్ కు ఓ కథ చెప్పారట. కథ హీరోకు నచ్చింది. అయితే అతను ఆల్రెడీ ఓ మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. వీటిలో ఏదైనా ఒకటి పూర్తి కాగానే రామ్ లక్ష్మణ్ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ లోగా వీళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు కథపై మరింత కసరత్తు చేస్తారు.

సో.. అల వైకుంఠపురములో సినిమా క్లైమాక్స్ లో ఫైట్ వద్దని.. ఓ పాటతో క్లైమాక్స్ ను ముగించాలని త్రివిక్రమ్ కే సలహా ఇచ్చి.. అమలు చేయించి ఆకట్టుకున్న ఈ సోదర ద్వయం.. దర్శకులుగా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

Related Posts