చిరంజీవి అనుకున్నదే చేస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. ఇలాంటివి ఆయనకు కొత్తేం కాదు. కానీ ఈ సినిమా తెలిసి తెలిసి చేసిన, చూసిన డిజాస్టర్. ఎంతోమంది ఈ మూవీ చేయొద్దని చెప్పారు. ఆయన వినలేదు. తనలోని వింటేజ్ స్టార్ ను చూసి ఫ్యాన్స్ తో ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడతారు అనుకున్నాడు. కానీ ఫ్యాన్స్ కూడా థియేటర్స్ నుంచి పరుగులు తీసేలా చేశాడు. మెహర్ రమేష్ కు ఉన్న చివరి అవకాశం కూడా ఈ మూవీతో పూర్తిగా పోయింది.


భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమాకు కమిట్అయ్యాడు. బట్ భోళా రిజల్ట్ చూశాక.. మళ్లీ తన పాత ఇమేజ్ తాలూకూ సన్నివేశాలు రిఫ్లెక్ట్ అయ్యాయట. అందుకే ఆ మూవీ తర్వాత చేయాలనుకున్న విశిష్ట సినిమాను ముందు మొదలుపెట్టబోతున్నాడు. టెక్నికల్ గా ఈ చిత్రానికి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీనికి ముందు రావాల్సిన ‘మెగా 156’కళ్యాణ్ కృష్ణ మూవీ అన్నమాట.


అయితే భోళా తర్వాత చాలా ఆలోచనలో పడ్డాడు మెగాస్టార్. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయమే ఇది. అందుకే ముందు వశిష్ట సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈ మేరకు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని అఫీషియల్ గా ప్రకటించారు.

మరోవైపు ఈ చిత్రంలో నటించే హీరోయిన్లకు సంబంధించిన వేట ఆల్రెడీ మొదలైంది. చాలామంది నయనతార, అనుష్కల పేర్లు చెబుతున్నారు. బట్ నయనతార నటించే అవకాశం లేదు. అనుష్కను మిస్ శెట్టిగా చూసిన జనం ఫిక్స్ అయిపోయారు.. తనింక హీరోయిన్ గా పనికిరాదు అని. తన ఫిజిక్ తగ్గించుకున్నా కూడా కష్టమే. సో.. మరో బ్యూటీ కోసం చూస్తారు. ఇక ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతోంది. ఒకప్పుడు జగదేకవీరుడుగా అలరించిన మెగాస్టార్ ను మళ్లీ ఆ తరహా పాత్రలో ప్రెజెంట్ చేయబోతున్నాడట వశిష్ట. మరి సో.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందన్నమాట.

Related Posts