రామ్ చరణ్ – సుకుమార్ స్టోరీ లీక్? మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ క్రేజీ కాంబోలో ‘ఆర్.సి.17’ రూపొందుతోంది. ‘రంగస్థలం’ చిత్రంతో రామ్ చరణ్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చిన సుకుమార్.. ఈసారి చరణ్ ను మరో కొత్త అవతారంలో ఆవిష్కరించబోతున్నాడట.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా పొలిటికల్ డ్రామా. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా పీరియడ్ టచ్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఇక.. సుకుమార్ తో చేయబోయే సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటివరకూ సుకుమార్ ‘పుష్ప, రంగస్థలం’ వంటి పీరియడ్ మూవీస్ చేశాడు. కానీ.. రాజమౌళి తరహాలో వందల ఏళ్లు వెనక్కి వెళ్లి సినిమాలు చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కోసం రెండు వందల ఏళ్లు వెనక్కి వెళ్లబోతున్నాడట. 19వ శతాబ్దం నేపథ్యంలో మద్రాస్ బ్యాక్ డ్రాప్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా చరణ్ సినిమా స్టోరీ డిజైన్ చేశాడట సుక్కూ.

రామ్ చరణ్ అంటేనే అదిరిపోయే డ్యాన్సులతో పాటు సాలిడ్ స్టంట్స్ గుర్తుకొస్తాయి. ఇక.. హార్స్ రైడింగ్ లో చెర్రీ మాస్టర్ డిగ్రీయే చేశాడు. ‘రంగస్థలం’ కోసం చరణ్ స్టంట్ ఎబిలిటీస్ ను అంతగా ఉపయోగించుకోని సుకుమార్ ఇప్పుడు ‘ఆర్.సి.17’ కోసం మాత్రం అతనిలోని యాక్షన్ యాంగిల్ ను సెంట్ పర్సెంట్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడట. ఈ సినిమాలో హార్స్ రైడింగ్ సన్నివేశాలు అదిరిపోతాయనే ప్రచారం జరుగుతుంది. మొత్తంమీద.. ఈ ఏడాది ద్వితియార్థం నుంచి ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 2025లో ‘ఆర్.సి.17’ ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts