ఘనంగా జరిగిన రకుల్-జాకీ భగ్నానీ వివాహం

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం సినీ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ఘనంగా జరిగింది. గోవాలోని ఓ రిసార్ట్స్‌ లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసింది రకుల్. కన్నడతో పాటు.. హిందీ, తమిళం వంటి పరిశ్రమల్లోనూ నటించినా రకుల్ కి ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే గుర్తింపు లభించింది. తెలుగులో అగ్ర కథానాయకులతో నటించి తక్కువ సమయంలోనే అగ్ర పథానికి చేరుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ ‘అయలాన్‘ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన రకుల్.. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2‘లో నటిస్తోంది.

Related Posts