బెల్లంకొండ సరసన మరోసారి అనుపమ

టాలీవుడ్ లో యాక్షన్ ఇమేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది యువ కథానాయకుల్లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమాలు అనువాద రూపంలో హిందీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో.. డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమా చేశాడు. తెలుగులో ఘన విజయాన్ని సాధించిన ప్రభాస్ ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేశాడు. కానీ.. అక్కడ ఆశించిన విజయం సాధించలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు పక్కనపెట్టేసిన బెల్లంకొండ.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈకోవలోనే ‘టైసన్ నాయుడు’ చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ‘టైసన్ నాయుడు’ ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది.

త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ‘కిష్కిందపురి’ సినిమాని అనౌన్స్ చేశాడు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉందట టీమ్.

ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీలో బెల్లంకొండ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారట. గతంలో ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ-అనుపమ హిట్ కొట్టారు.

ఇప్పుడు ఈ హిట్ కాంబో తమ సినిమాకి ప్లస్ అవుతోందని భావిస్తున్నారట నిర్మాత సాహు గారపాటి.

Related Posts