రాజు గారి అమ్మాయి.. నాయుడు గారి అబ్బాయి ట్రైలర్‌ లాంచ్

రాజు గారి అమ్మాయి..నాయుడు గారి అబ్బాయి.. ఈ పేరు వినగానే పవర్‌స్టార్ ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి గుర్తొస్తుంది కదూ.. అదే వైబ్రేషన్‌తో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకట శివ సాయి పిల్మ్స్ బ్యానర్‌ నిర్మించిన చిత్రమిది. నున్నా రవితేజ, నేహా జురెల్‌ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ , లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్ గా లాంచ్ చేసారు.


ఈ చిత్ర ట్రైలర్‌ను లవ్‌ , కామెడీ , సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేసారు . రాజు గారి అమ్మాయి హత్య బ్యాక్‌డ్రాప్‌తో నాయుడు గారి అబ్బాయే అనుమానితుడిగా సాగే ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌ ఇది.
అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది అన్నారు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వీరశంకర్‌. మొదటి సినిమాతోనే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో సత్యరాజ్‌ వస్తున్నాడని మెచ్చుకున్నారు. ముత్యాల రామదాసు చాంబర్‌లో అనేక పదవులు నిర్వహించిన అనుభవశాలి అని పొగిడారు. ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ ను మెచ్చుకున్నారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనే టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. దర్శకుడు సత్యరాజ్ కి మంచి విజన్ ఉంది. సంగీత దర్శకుడిగా రోషన్ సాలూరిని తీసుకొని తనకున్న పరిమిత వనరులతోనే అద్భుతమైన సంగీతాన్ని రాబట్టుకోగలిగాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. దర్శకుడు తాను ఏం చేయాలో ఈ సినిమా కోసం అంతా చేశాడు. ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ గా మేము ఆలోచించేది ఏంటంటే ఇది కమర్షియలా కాదా. ఎందుకంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అంశాలు సినిమాలో ఉండాలి. మంచి మ్యూజిక్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించడం చూస్తున్నాం. రాజుగారి అమ్మాయి నాయుడుగారి చిత్రంలో కూడా ఆ కళ కనిపిస్తుందన్నారు నిర్మాత ముత్యాల రామదాసు.


ఈ సినిమాకి ప్రధాన బలం నిర్మాత ముత్యాల రామదాసు గారే అన్నారు హీరో రవితేజ నున్నా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్న విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ఇదన్నారు. మిగతా ఆర్టిస్టులు బాగా చేసారన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.చిన్న సినిమాని బతికించాలంటే అది మీడియా వల్లే సాధ్యమవుతుంది. అందుకే మీడియానే ముఖ్యఅతిథులుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా సినిమా పూర్తయ్యి, విడుదలకు సిద్ధమైందంటే రామదాసు గారే కారణం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నామన్నారు డైరెక్టర్‌ సత్యరాజ్‌.
ఈ చిత్రం మార్చి 9వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Related Posts